హర్మూజ్ జలసంధిలో 90 శాతానికి పైగా పడిపోయిన రవాణా!

హర్మూజ్ జలసంధిలో 90 శాతానికి పైగా పడిపోయిన రవాణా!

Advertisements

<p>పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి గుండా నౌకాయానం గణనీయంగా క్షీణించింది&period; ఈ సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి హర్మూజ్ జలసంధిలో రవాణా 90 శాతానికి పైగా పడిపోయింది&period; మార్చి 1 నుంచి ఏప్రిల్ 27 మధ్య హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడులు&comma; వేధింపులు&comma; ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పిపోవడం వంటి 40కి పైగా సంఘటనలు జరిగాయి&period; ఈ మేరకు రాయల్ నేవీ నేతృత్వంలోని పర్యవేక్షణ సంస్థ అయిన యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఓ ప్రకటనలో తెలిపింది&period; పశ్చిమాసియా ఘర్షణల వల్ల హర్మూజ్ జలసంధి తీవ్రంగా ప్రభావితం అయ్యింది&period; ఆ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు&comma; అందులోని సిబ్బంది నేరుగా దెబ్బతిన్నారు&period; అదే సమయంలో అనేక నౌకలపై దాడులు జరిగాయి&period; వాటిని హర్మూజ్ నుంచి బలవంతం వెనక్కి వెళ్లేలా దాడులు చేశారు&period; యూఎస్-ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి ఉన్నప్పటికీ ఇరు దేశాల పరస్పరం హెచ్చరికలు చేసుకుంటున్నాయి&period; దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి&period; ఈ క్రమంలో అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు భారీగా సైనిక సామగ్రి చేరుకుంది&period; దీంతో ఇరాన్‌పై మరోసారి భీకర దాడులకు అమెరికా సిద్ధమవుతోందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి&period; కాగా&comma; ఇటీవలే ఒక్క రోజు వ్యవధిలోనే అమెరికా నుంచి 6&comma;500 టన్నుల సైనిక సామగ్రి అందినట్లు ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది&period; రెండు కార్గో నౌకలు&comma; పలు విమానాల్లో ఈ సామగ్రి వచ్చిందని స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..