హర్మూజ్ జలసంధి వద్ద యుద్ధ మేఘాలు..

Advertisements

<p>ప్రపంచ దేశాల గుండెల్లో హార్మూజ్ జలసంధి అలజడి రేపుతోంది&period; చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గంలో ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి&period; గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన వందలాది షిప్పులు వారాల తరబడి అక్కడే చిక్కుకుపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళన మొదలైంది&period; ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ &&num;8216&semi;ప్రాజెక్ట్ ఫ్రీడమ్&&num;8217&semi; ప్రకటించగా&comma; ఇరాన్ మాత్రం &&num;8216&semi;మా పర్మిషన్ లేనిదే ఒక్క అడుగు కూడా వేయనివ్వం&&num;8217&semi; అంటూ హెచ్చరికలు జారీ చేసింది&period;ప్రపంచ చమురు అవసరాల్లో దాదాపు 20 శాతానికి పైగా తీర్చే &&num;8216&semi;హార్మూజ్ జలసంధి&&num;8217&semi; ఇప్పుడు యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది&period; గత ఫిబ్రవరిలో మొదలైన ఇరాన్-అమెరికా ఘర్షణలు ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి&period; ప్రస్తుతం ఇక్కడ డ్యూయల్ బ్లాక్-అవుట్ నడుస్తోంది&period;జలసంధిలో చిక్కుకున్న సుమారు 850కి పైగా వాణిజ్య నౌకలను&comma; 20 వేల మంది నావికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అమెరికా ఈ ఉదయం &&num;8216&semi;ప్రాజెక్ట్ ఫ్రీడమ్&&num;8217&semi;ను ప్రారంభించింది&period;అయితే&comma; తమ సైన్యం అనుమతి లేకుండా ఏ నౌక కదిలినా దాడులు తప్పవని ఇరాన్ మేజర్ జనరల్ అలీ అబ్దుల్లాహి తీవ్రంగా హెచ్చరించారు&period;జస్క్‌తీరం వద్ద ఒక అమెరికా యుద్ధ నౌకపై ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి&period; ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ à°§à°° బ్యారెల్‌కు 110 డాలర్లకు చేరుకుంది&period; ఒకవైపు పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు జరుగుతున్నాయని ప్రచారం సాగుతున్నప్పటికీ&comma; క్షేత్రస్థాయిలో మాత్రం క్షిపణులు గర్జిస్తున్నాయి&period; అగ్రరాజ్యం అమెరికా యుద్ధనౌకలను మొహరించడంతో ఈ ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయోనని ప్రపంచ దేశాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..