ఈ అధ్యయనం ప్రకారం దేశంలో దాదాపు 10 కోట్ల మంది షుగర్(sugar) పేషెంట్లు ఉండగా 136 మిలియన్లలో ప్రీ డయాబెటిస్ లక్షణాలు కనిపించాయి. డయాబెటిస్‌లో మెటబాలిక్ డిజార్డర్‌తో బాధపడేవారు పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. క్వినోవా(Quinoa)లో ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్ జింక్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇది సహజంగానే తీపిగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో ఎనర్జీ ఉంటుంది. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆహారంలో కార్బోహైడ్రేట్లను చేర్చుకోవాలి. మధుమేహ రోగుల్లో చాలా మందికి కార్బోహైడ్రేట్లను ఎలా తీసుకోవాలో తెలియదు. కార్బో హైడ్రేట్లు తక్కువగా తీసుకుంటే డీహైడ్రేషన్ ప్రమాదం పెరగడంతో పాటు శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది.
ఇది చదవండి: లిప్ స్టిక్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..?
షుగర్ పేషెంట్లు తప్పనిసరిగా తమ భోజనంలో 40 నుంచి 50 గ్రాముల పిండి పదార్థాలను చేర్చుకోవాలి. ఇందులో విటమిన్లు, ఫైబర్ ఉంటాయి. జీర్ణక్రియ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. చిలగడదుంప రక్తంలో చక్కెరను నియంత్రించడంలో, బరువు తగ్గించడంలో తోడ్పడుతుంది. చిలగడ దుంపలు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్ల కోసం మంచి ఆప్షన్ గా నిలుస్తాయి. బీన్స్ నుంచి కార్బోహైడ్రేట్లను పొందవచ్చు. చిక్కుళ్లు ఎక్కువ కాలం శక్తిని ఇవ్వడంతోపాటు బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచుతాయి. పాస్తా అనారోగ్యకరమైన ఆహారాల్లో ఒకటైనప్పటికీ పిండి పదార్థాల కోసం పాస్తా తినవచ్చు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.