ట్రాన్స్జెండర్ వ్యక్తులు తరచుగా ఎదుర్కొనే ప్రత్యేక ఆరోగ్య అవసరాలను ఈ కేంద్రం దృష్టిలో ఉంచుకుని ప్రారంభించబడింది. ఎఎంఆర్ఐ ముకుందాపుర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక యూనిట్ వైద్య పరీక్షలు, హార్మోన్ థెరపీ, శస్త్రచికిత్సా ప్రక్రియలు వంటి సేవలను అందిస్తుంది.
ట్రాన్స్జెండర్ వ్యక్తుల ఆరోగ్యంపై ప్రత్యేక శిక్షణ పొందిన వైద్య సిబ్బంది ఈ కేంద్రంలో పనిచేస్తారు. ఇది ట్రాన్సజెండర్స్ కు సానుకూల వాతావరణాన్ని అందిస్తుంది. రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి వైద్య సేవలు అందిస్తుంది.
ట్రాన్స్జెండర్ ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత
ట్రాన్స్జెండర్ వ్యక్తులు సాధారణ జనాభా కంటే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. డిప్రెషన్, ఆందోళన, హై బీపీ మరియు గుండె జబ్బులు వంటి ప్రమాదం వారిలో ఎక్కువగా ఉంటుంది. ఈ కేంద్రం లో వారు ఎదుర్కొనే ఆరొగ్య సమస్యలకు మంచి పరిష్కార మార్గం లభిస్తుంది.
కోల్కతాలోని ఈ కొత్త యూనిట్ ట్రాన్స్జెండర్ వ్యక్తుల ఆరోగ్య సమస్యలు తెలుసుకొని మరియు వారికి మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధించడంలో సహాయపడుతుంది. ఇది ఇతర నగరాలకు ఆదర్శంగా ఉండాలి మరియు భారతదేశంలో ట్రాన్స్జెండర్ ఆరోగ్య సంరక్షణకు నమూనాగా ఉండాలి అని సంకల్పం తో ప్రారంభించారు.
ఈ కొత్త యూనిట్ ప్రారంభం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఒక గొప్ప అవకాశం. ఇది వారి ఆరోగ్య అవసరాలను గుర్తించి, వారి మెరుగైన ఆరోగ్యనికి సహాయపడుతుంది.