90
తిరుపతి జిల్లా రేణిగుంటలో మూడు రోజులుగా కురుస్తున్న తుఫాన్ వర్షాలకు తిరుపతి జిల్లా మల్లె మడుగు ప్రాజెక్టు కు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మంగళవారం మల్లె మడుగు రిజర్వాయర్ వర్షాలకు వాగులు, వంకల నుంచి రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వస్తోంది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతుండగా జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు 22 గేట్లను మేర ఎత్తి 22 వేలు క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఇంకా ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉన్నదని, దీంతో సిబ్బందిని మరింత అప్రమత్తంగా ఉంచామని ఈ ఈ మధుసూదన్ రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ అర్చన తెలిపారు.