తిరుపతి జిల్లా శ్రీ సిటీ లోని హీరో మోటార్ సైకిల్ తయారీ సంస్థ తిరుపతి జిల్లా పోలీస్ శాఖకు 200 గ్లామర్ ద్విచక్ర వాహనాలను సీ ఎస్ ఆర్ స్కీం ఉచితంగా ఇచ్చారు. అందులో భాగంగా బుధవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో తిరుపతి పృథ్వి హీరో సంస్థ ఆధ్వర్యంలో 30 ద్విచక్ర వాహనాలను పోలీస్ శాఖ కు అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. హీరో మోటార్ సైకిల్ తయారీ సంస్థ ప్రతినిధులు,
హీరో సంస్థ అధినేత పృథ్వి సంయుక్తంగా ఈ వాహనాలను ఎస్పీ సమక్షంలో జిల్లా పోలీస్ శాఖకు అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం 120 ద్విచక్ర వాహనాలను ఇవ్వడం జరిగిందన్నారు. నేడు 30 వాహనాలు అందజేశామని తెలిపారు. మరో విడత 50 ద్విచక్ర వాహనాలు అందివనున్నట్లు తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో భక్తుల భద్రత తో పాటు తిరుపతి జిల్లాలో పోలీస్ శాఖ శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. హీరో మోటార్ వాహనాల సంస్థ భవిష్యత్తులో కూడా ప్రజా సంక్షేమం కోసం అవసరమైన సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందని ఆ సంస్థ ప్రతినిధులు, తిరుపతి హీరో సంస్థ అధినేత పృథ్వి తెలియజేశారు.
పోలీస్ శాఖకు 200 ద్విచక్ర వాహనాలను బహుకరించిన హీరో సంస్థ..
79
previous post