82
మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఓ ముస్లిం యువకుడు మత సామరస్యాన్ని చాటుకున్నాడు. అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు కార్తీక మాసం సందర్భంగా తాడేపల్లి మండలం నులకపేట లో మహేష్ రెడ్డి యువకుడు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్థానిక నులకపేట ప్రాంతానికి చెందిన షేక్ జిలాని అనే ముస్లిం యువకుడు.. అయ్యప్ప భజన పూజా కార్యక్రమానికి వచ్చిన అయ్యప్ప దీక్ష స్వాములకు కులమతాలకు అతీతంగా సహపంక్తి భోజనం (బిక్ష) ఏర్పాటు చేశాడు.