హ‌ర్మూజ్‌పై పట్టు మాదేనన్న ట్రంప్‌…

ఎట్టకేలకు తెరుచుకున్న హర్మూజ్ జలసంధి

Advertisements

<p>à°¹‌ర్మూజ్ జలసంధి తమ పూర్తి నియంత్రణలో ఉందని&comma; ఇరాన్‌తో తుది ఒప్పందం కుదిరే వరకు సముద్ర దిగ్బంధం ఎత్తివేసేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు&period; ఈ దిగ్బంధం అద్భుత విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు&period; అయితే&comma; వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని&comma; అమెరికా ఆంక్షలను దాటుకుని ఇరాన్‌కు చెందిన డజన్ల కొద్దీ నౌకలు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి&period; ఈ నెల‌ 13à°¨ అమెరికా దిగ్బంధం విధించినప్పటి నుంచి ఇరాన్‌కు సంబంధమున్న కనీసం 34 ట్యాంకర్లు à°¹‌ర్మూజ్ జలసంధిని దాటాయి&period; వీటిలో 19 ట్యాంకర్లు గల్ఫ్ నుంచి బయటకు వెళ్లగా&comma; మరో 15 గల్ఫ్‌లోకి ప్రవేశించాయి&period; బయటకు వెళ్లిన వాటిలో ఆరు నౌకలు సుమారు 10&period;7 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురును రవాణా చేస్తున్నట్లు నిర్ధారణ అయింది&period; దీని ద్వారా ఇరాన్‌కు దాదాపు 910 మిలియన్ డాల‌ర్ల‌ ఆదాయం సమకూరినట్లు అంచనా&period; ఇప్పటివరకు అమెరికా దళాలు కేవలం ఒక కంటైనర్ షిప్‌ను అదుపులోకి తీసుకుని&comma; 28 నౌకలను వెనక్కి పంపినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది&period; అమెరికా నిఘా నుంచి తప్పించుకోవడానికి ఇరాన్ నౌకలు అత్యాధునిక పద్ధతులు వాడుతున్నాయి&period; &&num;8216&semi;డొరెనా&&num;8217&semi; అనే ఇరాన్ సూపర్‌ట్యాంకర్ తన ఉనికిని&comma; లొకేషన్‌ను తెలిపే ట్రాన్స్‌పాండర్‌ను ఆపివేసి జలసంధిని దాటింది&period; ఆ తర్వాత మలేషియా తీరంలో మరో నౌకలోకి చమురును మార్పిడి చేసి&comma; దాని మూలాలను దాచిపెట్టే ప్రయత్నం చేసింది&period; గతంలో అమెరికా ఆంక్షలు ఎదుర్కొన్న &&num;8216&semi;మురళీకిషన్&&num;8217&semi;&comma; &&num;8216&semi;అలీసియా&&num;8217&semi; వంటి ట్యాంకర్లు కూడా ఈ దిగ్బంధనాన్ని దాటి గల్ఫ్‌లోకి ప్రవేశించాయి&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు ఇరాన్ కూడా ప్రతివ్యూహాలు రచిస్తోంది&period; à°¹‌ర్మూజ్ జలసంధి నియంత్రణ తిరిగి తమ చేతికి వచ్చిందని&comma; జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌక తమ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ నేవీ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది&period; పౌర నౌకలకు ప్రత్యేక మార్గాన్ని నిర్దేశిస్తూ&comma; సైనిక నౌకల రాకపోకలను పూర్తిగా నిషేధించింది&period; ఇటీవల ఇరాన్ దళాలు ఫ్రాన్స్&comma; భారత్‌కు చెందిన నౌకలపై కాల్పులు జరపడం ఉద్రిక్తతలను పెంచింది&period; ఈ పరిణామాలతో నౌకల యజమానులు ఆందోళన చెందుతున్నారు&period; ఇది ఒకవైపు అమెరికా&comma; మరోవైపు ఇరాన్ విధించిన &OpenCurlyQuote;డబుల్ దిగ్బంధం’గా మారిందని వాపోతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.