193
పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం నర్సీపురం గ్రామంలో రైల్వే స్టేషన్ సమీపంలోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు హుండీ చోరీకి పాల్పడ్డారు. ఉదయము ఆలయానికి వచ్చిన భక్తులు తాళం పగలుగొట్టి వుండటాన్ని చూసి కమిటీ సభ్యులకు పిర్యాదు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న సిసి కెమెరాలో హుండీ చోరీ రికార్డ్ అయ్యింది. అధికారులు కెమెరాల పరిశీలనా అనంతరo దుండగులు పై చర్యలు తీసుకుంటామన్నారు.