ప్రపంచవ్యాప్తంగా షిర్డీ సాయిబాబాను పూజించే భక్తులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. బాబాను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరతాయని చాలామంది భావిస్తారు. గురువారం రోజున ఉపవాసం ఉండి సాయిబాబాను పూజించిన వాళ్లకు కోరిన కోరికలు నెరవేరడంతో పాటు పుణ్యం లభిస్తుంది. 9 గురువారాలు ఉపవాసం ఉండటం వల్ల మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. గురువారం రోజున తెల్లవారుజామున నిద్ర లేచి ఉపవాసం చేస్తూ బాబాను పూజించాలి. గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించి బాబాను పూజించడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. బాబా విగ్రహాన్ని గంగాజలంతో శుభ్రం చేసి పూజలో పెట్టి పసుపు రంగు వస్త్రం కప్పి ఉంచాలి. బాబాను పువ్వులతో అలకరించించి లడ్డూలను నేవేద్యంగా పెట్టి పూజించడం వల్ల అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సాయిబాబా కథను వినిపించి ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టాలి. గురువారం రోజున ఉన్నదానిలో కొంత మొత్తాన్ని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉంటుంది. భక్తులు తొమ్మిది గురువారాలు ఉపవాసం చేయడం ద్వారా సాయిబాబా అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. గురువారం రోజున ఐదుగురు పేదలకు అన్నదానం చేస్తే మంచిది. ఉపవాస సమయంలో పండ్లు మాత్రమే తీసుకుని దేవుడిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. సాయిబాబా ముందు దీపం వెలిగించి గుడికి వెళ్లి ఒక్కసారి అయినా భోజనం చేయడం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి. సాయినాథునికి కిచిడీ, పసుపు మిఠాయిలు ఇచ్చి పూజించడం ద్వారా కూడా మేలు జరుగుతుంది. ఉపవాసం చేసిన రోజున పండ్లు తీసుకోవడంతో పాటు ఒకపూట భోజనం చేయవచ్చు. సాయిబాబా అందరి సంతోషాన్ని కోరుకుంటాడు.
గురువారం రోజు ఇలా చేస్తే మీ కోరికలు ఫలిస్తాయి
85