పశ్చిమాసియా యుద్ధ మేఘాలను దాటి కొన్ని చమురు, గ్యాస్‌ నౌకలు ఒక్కొక్కటిగా భారత్‌కు చేరుకుంటున్నాయి.

Advertisements

<p>పశ్చిమాసియా యుద్ధ మేఘాలను దాటి కొన్ని చమురు&comma; గ్యాస్‌ నౌకలు ఒక్కొక్కటిగా భారత్‌కు చేరుకుంటున్నాయి&period; దేశీయ ఇంధన ప్రయోజనాలను కాపాడటంలో భాగంగా ఈ నౌకల భద్రత కోసం భారత నేవీ ప్రత్యేక చర్యలు చేపట్టింది&period; చమురు&comma;ఎల్పీజీ నౌకలను సురక్షితంగా హర్మూజ్‌ను దాటిస్తోంది&period; సాధారణంగా భారత్‌ వచ్చే చమురు&comma; గ్యాస్‌ నౌకలు సౌదీ అరేబియాలోని రాస్‌ తనురా వంటి పోర్టుల నుంచి ప్రయాణం ప్రారంభిస్తాయి&period; ఇవి పర్షియన్‌ గల్ఫ్‌ మీదుగా హర్మూజ్‌ జలసంధి వద్దకు చేరుకుంటాయి&period; నౌక వేగం&comma; ప్రయాణించే మార్గాన్ని బట్టి ఇందుకు గరిష్ఠంగా రెండు రోజుల సమయం పడుతుంది&period; ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ జలసంధి వద్దే వందలాది నౌకలు చిక్కుకుపోయాయి&period; దీంతో వాటిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత నౌకాదళం రంగంలోకి దిగింది&period; ఇరాన్‌ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవడంతో పాటు నౌకలు జలసంధి దాటేవరకు అనుక్షణం వాటికి సహాయసహకారాలు అందిస్తోంది&period; హర్మూజ్‌ దాటిన తర్వాత ఈ నౌకలు గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లోకి ప్రవేశించి అక్కడినుంచి అరేబియా సముద్రంలోకి వస్తాయి&period; దీంతో ఈ రెండు ప్రాంతాల వద్ద భారత నేవీ 5 యుద్ధ నౌకలను మోహరించింది&period;<&sol;p>&NewLine;<p>ఈ యుద్ధ నౌకల సహకారంతోనే ఇటీవల రెండు గ్యాస్‌ ట్యాంకర్లు పైన్‌ గ్యాస్‌&comma; జగ్‌ వసంత్‌ అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి భారత్‌ దిశగా పయనిస్తున్నాయి&period; అంతకుముందు శివాలిక్‌&comma; నందాదేవి వంటి గ్యాస్‌ నౌకలు కూడా ఈ ఆపరేషన్‌లో భాగంగానే దేశీయ పోర్టులకు చేరుకోగలిగాయి&period; ప్రస్తుతం ఇక్కడ భారత్‌కు రావాల్సిన 22 నౌకలు తరలింపునకు సిద్ధంగా ఉన్నాయి&period; వీటిల్లో 20 వరకు ఎల్పీజీ&comma; ఎల్‌ఎన్‌జీ&comma; క్రూడ్‌ ఆయిల్‌ రవాణా చేస్తున్నవే&period;&period;&excl; సాధారణంగా సముద్రంలో ప్రయాణం హైడ్రోగ్రాఫిక్‌ చార్ట్‌లు&comma; నావిగేషన్ వ్యవస్థల ఆధారంగా ఉంటుంది&period; ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్‌ జలసంధి సమీపంలో ఇరాన్‌ సీమైన్స్‌ను అమర్చినట్లు వార్తలొచ్చాయి&period; వీటిల్లో చాలావరకు బయటకు కన్పించవు&period; వీటి కారణంగా నౌకలకు తీవ్ర ముప్పు పొంచి ఉంటుంది&period; అందుకే&comma; ఈ సీమైన్స్‌ తగలకుండా నౌకలను హర్మూజ్‌ను దాటించడం అత్యంత ఆవశ్యకం&period; దీన్ని గుర్తించిన భారత నేవీ&period;&period; మన నౌకల కోసం ప్రత్యేక హైడ్రోగ్రాఫిక్‌ చార్ట్‌లను రూపొందిస్తోంది&period; నిఘా నౌకలతో సముద్ర గర్భాన్ని స్కాన్‌ చేసి నావిగేషన్‌ రూట్స్‌ను గుర్తిస్తోంది&period; ఆయా మార్గాలను నౌకలకు ఎప్పటికప్పుడు అందిస్తూ వాటిని హర్మూజ్‌ నుంచి తీసుకొస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..