90
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలోని బసంత్ నగర్ SST చెక్ పోస్ట్ వద్ద హోంమంత్రి మహమూద్ ఆలీ వాహనాన్ని తనిఖీ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి గోదావరిఖని మార్కండేయ కాలని లోని ఓ ప్రవేట్ పంక్షన్ హాల్ లో ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమ్మేళనానికి వస్తున్న హోం మంత్రి మహమూద్ అలీ కాన్వాయ్ ని అపి వాహనాలను తనిఖీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఇందులో భాగంగా హోం మంత్రి వాహనాన్ని కూడా తనిఖీ చేసినట్లు ఎస్ ఎస్ టి అదికారులు పేర్కొన్నారు.
Read Also..