అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈనెల 4వ తేదీన జరిగిన ప్రతిష్టాత్మక వేడుకల్లో దివ్యాంగజన్ 2023 సాధికారత కోసం జాతీయ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పొందడం అదృష్టంగా భావిస్తానని పుట్టపర్తికి చెందిన సాయి కౌస్తువ్ దాస్ గుప్తా హర్షం వ్యక్తం చేశారు.అవార్డు తీసుకున్న అనంతరం పుట్టపర్తికి వచ్చిన గుప్తా తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ గిన్నిస్, లిమ్కా వరల్డ్ రికార్డు కలిగి ఉన్న తాను ఇప్పటివరకు వివిధ వేదికలపై 500 పైన అవార్డులను అందుకున్నానని పేర్కొన్నారు.
అదేవిధంగా పుట్టపర్తి నుంచి ఢిల్లీకి వెళ్లడానికి విమానంలో తనకు అనుగుణమైన సౌకర్యాలు లేనందువల్ల తన సొంత వాహనంలోనే ఢిల్లీ వెళ్లి వచ్చానని చెప్పారు. చిన్న చిన్న ఇబ్బందులను సైతం ధైర్యంగా ఎదుర్కొని దాదాపు 8 రోజులు ప్రయాణం చేశానని తెలిపారు. పూర్తి అంగవైకల్యం ఉన్న తనలాంటి వాళ్లు సమాజంలో జీవిస్తున్నప్పుడు సామాన్య ప్రజలు జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని సంతోషంగా నవ్వుతూ జీవించాలని కోరారు. అదేవిధంగా సత్యసాయి ఆశీస్సులతో కాసేపు బాబా గీతాలాపనతో ముచ్చటించారు. అనంతరం రాబోయే రోజుల్లో కూడా పద్మశ్రీ ఆవార్డును పొందాలని ఉందని దాస్ గుప్తా ఆకాంక్షించారు.
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం..
73
previous post