ఇరాన్‍పై అమెరికా రెండో విడత దాడులు.

ఇరాన్‍పై అమెరికా రెండో విడత దాడులు

Advertisements

<p>పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి&period; ఇరాన్ లక్ష్యంగా అమెరికా సైన్యం మరో విడత భారీ దాడులను ప్రారంభించింది&period; అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల రక్షణే ధ్యేయంగా ఈ దాడులు జరుపుతున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది&period; ఈ మేరకు అమెరికా సైన్యం మరోసారి రెండు విడతలుగా ఇరాన్ సైనిక స్థావరాలపై విరుచుకుపడింది&period; గ్రేటర్ టున్బ్ ద్వీపంలోని ఇరాన్ తీరప్రాంత రక్షణ వ్యవస్థలు&comma; క్రూజ్ క్షిపణుల నిల్వ కేంద్రాలు&comma; క్షిపణి ప్రయోగ కేంద్రాలపై అమెరికా వైమానిక దళం కచ్చితమైన లక్ష్యాలతో బాంబుల వర్షం కురిపించింది&period; దాదాపు 90 నిమిషాల పాటు మొదటి విడత దాడులు సాగాయి&comma;&period; అనంతరం హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉన్న ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు అమెరికా రెండో విడత దాడులను కూడా విజయవంతంగా నిర్వహించింది&period; ఇరాన్ పోర్టులపై అమెరికా నావికా దళం ఆంక్షలను పునరుద్ధరించిన నేపథ్యంలో ఈ తాజా దాడులు చోటుచేసుకున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.

పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.

ఇరాన్‍పై మరోసారి అమెరికా దాడులు.