రష్యా నుంచి చమురు, గ్యాస్‌ కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లు.

Advertisements

<p>రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా కొరడా ఝళిపించేందుకు రంగం సిద్ధమైంది&period; రష్యా&comma; ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు ఉద్దేశించిన బిల్లుకు అమెరికా సెనెట్ భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది&period; లిండ్సే గ్రాహమ్ పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లుకు 86 మంది సెనెటర్లు అనుకూలంగా ఓటు వేయగా&period;&period; 11 మంది వ్యతిరేకించారు&period; ముఖ్యంగా రష్యన్ చమురు కొనుగోలు చేస్తున్న భారత్&comma; చైనాలపై 100 శాతం వరకు టారిఫ్ విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి కల్పించే నిబంధనలు ఇందులో ఉన్నాయి&period; అయితే ఇది వెంటనే అమల్లోకి వచ్చే టారిఫ్ కాదు&period; ప్రతినిధుల సభ ఆమోదం&comma; ఆ తర్వాత అధ్యక్షుడి చర్య కీలకం&period; మరి ఈ బిల్లు చట్టంగా మారితే భారత్‌పై ప్రభావం ఎంత&quest; ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రకంపనలు రేపుతుందన్ని చర్చనీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;<p>రష్యాపై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచే దిశగా అమెరికా కీలక అడుగు వేసింది&period; లిండ్సే ఓ&period; గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026కు సెనెట్ 86-11 ఓట్లతో ఆమోదం తెలిపింది&period; రష్యా చమురు&comma; గ్యాస్ కొనుగోలు ద్వారా మాస్కో ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నదే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం&period; అధ్యక్షుడికి కొన్ని దేశాల దిగుమతులపై 100 శాతం వరకు టారిఫ్ విధించే అధికారం కల్పించే నిబంధనలు ఇందులో ఉన్నాయి&period;రష్యా చమురు కొనుగోలు చేసే అతిపెద్ద దేశాల్లో భారత్&comma; చైనా కీలకంగా ఉన్నాయి&period; అందుకే ఈ బిల్లు చట్టరూపం దాల్చి&period;&period; అధ్యక్షుడు దాన్ని అమలు చేస్తే&period;&period; ఈ రెండు దేశాల నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులపై భారీ సుంకాల ముప్పు ఏర్పడుతుంది&period; అయితే 100 శాతం టారిఫ్ ఆటోమేటిక్‌గా పడదు&period; అధ్యక్షుడికి ఆ అధికారం లభిస్తుంది&period;&period; దాన్ని ఎప్పుడు&comma; ఎలా ఉపయోగించాలన్నది అమెరికా ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p>ఇక్కడే భారత్‌కు అసలు సవాలు&period; అమెరికా&period;&period; భారత్‌కు అత్యంత కీలకమైన ఎగుమతి మార్కెట్లలో ఒకటి&period; 2025లో భారత్ నుంచి అమెరికాకు వస్తువుల ఎగుమతులు దాదాపు 85 బిలియన్ డాలర్లకు చేరాయి&period; ఫార్మా&comma; టెక్స్‌టైల్స్&comma; ఇంజినీరింగ్ ఉత్పత్తులు&comma; రత్నాభరణాలు&comma; యంత్రాలు వంటి రంగాలకు అమెరికా మార్కెట్ అత్యంత ముఖ్యమైనది&period; కాబట్టి 100 శాతం వరకు అదనపు టారిఫ్ విధిస్తే&period;&period; భారతీయ ఉత్పత్తుల పోటీతత్వం దెబ్బతినే అవకాశం ఉంది&period;టారిఫ్ భారం పూర్తిగా అమెరికా దిగుమతిదారులపైనే పడుతుందని చెప్పలేం&period; భారత ఎగుమతిదారులు ధరలు తగ్గించి కొంత భారాన్ని భరించాల్సి రావచ్చు&period; లేదంటే అమెరికా దిగుమతిదారులు ఆ భారాన్ని వినియోగదారులపై మోపవచ్చు&period; అప్పుడు భారత ఉత్పత్తుల ధరలు పెరగడం&period;&period; డిమాండ్ తగ్గడం&period;&period; ఆర్డర్లు ఇతర దేశాలకు మళ్లే అవకాశాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>అయితే ఈ బిల్లుకు మరో కోణం కూడా ఉంది&period; రష్యన్ చమురుపై ఒత్తిడి పెరిగితే&period;&period; ప్రపంచ మార్కెట్లో రష్యా సరఫరా తగ్గే అవకాశం ఉంటుంది&period; అదే సమయంలో ప్రత్యామ్నాయ సరఫరాల కోసం భారత్&comma; చైనా వంటి దేశాలు మధ్యప్రాచ్యం&comma; ఆఫ్రికా&comma; అమెరికా తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ చమురు కొనుగోలు చేయాల్సి రావచ్చు&period; సరఫరా అంతరాయం పెరిగితే అంతర్జాతీయ క్రూడ్ ధరలపై కూడా ఒత్తిడి రావచ్చు&period; ఇప్పటికే పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా భారత్ చమురు దిగుమతి బిల్లు పెరుగుతోంది&period;<br &sol;>&NewLine;ఈ నిర్ణయం కేవలం భారత్&comma; చైనాలకు మాత్రమే పరిమితం కాదు&period; రష్యన్ ఎనర్జీపై ఆధారపడే ఇతర దేశాలపైనా అమెరికా ఒత్తిడి పెరగొచ్చు&period; ప్రపంచ చమురు వాణిజ్యంలో మార్పులు రావచ్చు&period; షిప్పింగ్&comma; ఇన్సూరెన్స్&comma; బ్యాంకింగ్ రంగాలపై కూడా అదనపు ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది&period; ముఖ్యంగా రష్యా చమురుకు ప్రత్యామ్నాయ సరఫరాల కోసం దేశాలు పోటీ పడితే&period;&period; ప్రపంచ ఎనర్జీ మార్కెట్ మరింత అస్థిరంగా మారే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p>భారత్&comma; అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న సమయంలోనే ఈ బిల్లు సెనెట్‌లో ఆమోదం పొందింది&period; 2026 ఫిబ్రవరిలో ఇరుదేశాలు వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఒక ఫ్రేమ్‌వర్క్‌కు చేరుకున్నాయి&period; అందులో అమెరికా మార్కెట్‌కు భారత్‌కు ప్రాధాన్య ప్రాప్యత&comma; సరఫరా గొలుసుల బలోపేతం వంటి అంశాలు ఉన్నాయి&period; అదే సమయంలో భారత్ వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన ఎనర్జీ&comma; విమానాలు&comma; టెక్నాలజీ&comma; ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయాలనే ఉద్దేశాన్ని ప్రకటించింది&period;ఇప్పుడు భారత్ ముందున్నది రెండు వైపుల సవాలు&period; ఒకవైపు చౌకైన రష్యన్ చమురు ద్వారా దేశీయ ఇంధన అవసరాలను తక్కువ ఖర్చుతో తీర్చుకోవాలి&period; మరోవైపు అమెరికా వంటి కీలక ఎగుమతి మార్కెట్‌ను కాపాడుకోవాలి&period; రష్యన్ చమురును పూర్తిగా వదులుకుంటే ప్రత్యామ్నాయ చమురు ఖరీదు పెరిగే అవకాశం ఉంది&period; కొనసాగిస్తే అమెరికా టారిఫ్ ముప్పు ఎదురవుతుంది&period; అందుకే భారత్ తన ఇంధన భద్రత&comma; ఎగుమతి ప్రయోజనాలు&comma; అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలు—ఈ మూడింటినీ సమతుల్యం చేయాల్సిన పరిస్థితి సవాల్ గా మారనుంది&period;<br &sol;>&NewLine;అయితే ప్రస్తుతానికి ఒక విషయం స్పష్టం&period; సెనెట్ ఆమోదం అంటే 100 శాతం టారిఫ్ వెంటనే అమల్లోకి వచ్చినట్టు కాదు&period; బిల్లు తదుపరి ప్రతినిధుల సభలో ఆమోదం పొందాలి&period; ఆ తర్వాత అధ్యక్షుడి సంతకం&comma; అమలు నిర్ణయాలు కీలకం&period; కాబట్టి రాబోయే రోజుల్లో వాషింగ్టన్‌లో జరిగే పరిణామాలు భారత్‌కు అత్యంత కీలకమని విశ్లేషణలు వెలువడుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p>రష్యన్ చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచడమే అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది&period; భారత్ విషయంలో మాత్రం ఇది కేవలం చమురు కొనుగోళ్ల అంశం కాదు&period;&period; ఇంధన భద్రత&comma; ఎగుమతులు&comma; అమెరికాతో వాణిజ్య సంబంధాలు&comma; ప్రపంచ మార్కెట్లపై ప్రభావం అన్నింటినీ కలిపిన పెద్ద వ్యూహాత్మక సవాలు&period; ఇప్పుడు బంతి అమెరికా ప్రతినిధుల సభ&comma; ఆ తర్వాత అధ్యక్షుడి కోర్టులో ఉంది&period; బిల్లు పాసైతే పరిణామాలు ఎలా ఉంటాయన్నది ప్రపంచదేశాల్లో ఉత్కంఠరేపుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీడీపీ యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం శిక్షణా తరగతులు.

ఇరాన్, రష్యాపై ఆంక్షల బిల్లుకు US సెనెట్ గ్రీన్ సిగ్నల్.

తిరుపతిలో మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం.