హర్మూజ్‌పై ఇరాన్‌ కఠిన వైఖరి.

Advertisements

<p>అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్‌ తన వైఖరిని మరింత కఠినతరం చేసింది&period; అమెరికా తన ధోరణిని మార్చుకుని&comma; తమ డిమాండ్లను అంగీకరించే వరకు హర్మూజ్‌ను తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది&period; అమెరికా బెదిరింపులు ఆపాలని&comma; నావికా దిగ్బంధనాన్ని తొలగించాలని ఇరాన్‌ డిమాండ్‌ చేస్తోంది&period; అలాగే తమ దేశం నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించడంతో పాటు&period;&period; యుద్ధ నష్టానికి పరిహారం చెల్లించాలని షరతులు విధించింది&period;<&sol;p>&NewLine;<p>విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులపై ఆంక్షలను కూడా బేషరతుగా ఎత్తివేయాలని ఇరాన్‌ కోరుతోంది&period; జులైలో ఇరు దేశాల మధ్య కుదిరిన మధ్యంతర ఒప్పందంలో ఆంక్షల తొలగింపు&comma; నష్టపరిహారం వంటి అంశాలపై తుది ఒప్పందంలో చర్చించేందుకు అంగీకారం కుదిరింది&period; అయితే ఆ చర్చలకు విధించిన 60 రోజుల గడువు మరో వారంలో ముగియనుంది&period; దీంతో గడువును పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>అయితే హర్మూజ్ జలసంధిని ముందుగా తెరవడంపై ఒప్పందం కుదిరితేనే మిగతా అంశాలపై చర్చిస్తామని అమెరికా పట్టుబడుతోంది&period; హర్మూజ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవాల్సిందేనని అమెరికా స్పష్టం చేస్తుండగా&period;&period; తమ డిమాండ్లు నెరవేరే వరకు జలసంధిని తెరవబోమని ఇరాన్‌ తేల్చిచెబుతోంది&period; దీంతో ఇరు దేశాల మధ్య చర్చల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది&period; హర్మూజ్‌ విషయంలో ఇరాన్‌ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు హర్మూజ్ జలసంధి నిర్వహణ కోసం ఒమన్‌తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియ తుది దశకు చేరినట్లు ఇరాన్‌ వర్గాలు వెల్లడించాయి&period; రవాణా మార్గంపై త్వరలోనే ఏకాభిప్రాయం కుదరవచ్చని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆశాభావం వ్యక్తం చేశారు&period; ఇరాన్‌-అమెరికా మధ్య కొనసాగుతున్న ఈ ఉద్రిక్తతకు చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందా&period;&period; లేక హర్మూజ్‌పై ప్రతిష్ఠంభన మరింత ముదురుతుందా అన్నది కీలకంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్