హార్ముజ్‌లో ఇరాన్‌ దూకుడు.

Advertisements

<p>స్ట్రెయిట్‌ ఆఫ్‌ హార్ముజ్‌లో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి&period; యూఏఈ ప్రభుత్వ రంగ చమురు సంస్థ ADNOCకు చెందిన నౌకలను ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ లక్ష్యంగా చేసుకున్నట్లు యూఏఈ ఆరోపిస్తోంది&period; కేవలం ఒక్క వారంలోనే మూడు వేర్వేరు నౌకలపై క్షిపణి దాడులు జరిగినట్లు తెలిపింది&period; ముడి చమురు రవాణా చేసే &OpenCurlyQuote;మొంబాసా బి’&comma; &OpenCurlyQuote;అల్‌ బహియా’ నౌకలు దాడుల్లో దెబ్బతిన్నట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;<p>ఆగస్టు 8à°¨ హార్ముజ్‌ జలసంధి దాటుతున్న మరో ట్యాంకర్‌పై క్రూయిజ్‌ క్షిపణితో దాడి జరిగినట్లు యూఏఈ వెల్లడించింది&period; దాడి తర్వాత నౌకలో మంటలు చెలరేగగా అత్యవసర సిబ్బంది వాటిని అదుపులోకి తెచ్చినట్లు తెలిపింది&period; ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్‌&comma; ఇరాన్‌ మధ్య ఘర్షణలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు యూఏఈకి చెందిన 15 నౌకలను ఇరాన్‌ లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం&period; ఈ దాడుల్లో ఒక భారతీయ నౌకా సిబ్బంది మృతి చెందగా&period;&period; మరో 20 మంది గాయపడినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు ఇరాన్‌ చర్యలపై యూఏఈ తీవ్రంగా మండిపడుతోంది&period; సముద్ర దాడులను &OpenCurlyQuote;పైరసీ’గా అభివర్ణిస్తూ&period;&period; అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను దెబ్బతీసేలా ఇరాన్‌ వ్యవహరిస్తోందని ఆరోపించింది&period; హార్ముజ్‌ జలసంధిలో చమురు రవాణాకు ఆటంకం కలిగించడం ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది&period; దీంతో గల్ఫ్‌ దేశాల్లో ఆందోళన మరింత పెరుగుతోంది&period;<&sol;p>&NewLine;<p>అయితే తమ చర్యలను ఇరాన్‌ సమర్థించుకుంటోంది&period; తమ హెచ్చరికలను పట్టించుకోకుండా కొన్ని నౌకలు నావిగేషన్‌ వ్యవస్థలను ఆపివేసి&period;&period; మైన్లు ఉన్న మార్గంలో ప్రయాణించేందుకు ప్రయత్నించాయని ఆరోపించింది&period; అందుకే వాటిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెబుతోంది&period; మరోవైపు సౌదీ అరేబియా&comma; ఖతార్‌&comma; జోర్డాన్‌ సహా పలు దేశాలు యూఏఈకి మద్దతుగా నిలిచాయి&period; హార్ముజ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ నౌకాయానం&comma; చమురు సరఫరాపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్