రష్యాపై వందలాది డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్.

Advertisements

<p>రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరింది&period; మాస్కో సహా రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ భారీగా డ్రోన్ దాడులు చేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది&period; ఒక్క రాత్రిలో దేశవ్యాప్తంగా 822 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించింది&period; మాస్కో ప్రాంతంలోనే వందలాది డ్రోన్లు లక్ష్యంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు&period; మాస్కో సమీపంలోని పోడోల్స్క్‌లో వైల్డ్‌బెర్రీస్ గోదాముపై డ్రోన్ దాడితో భారీగా మంటలు చెలరేగాయి&period; ఈ ఘటనలో 83 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా&period;&period; రష్యాలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన దాడులతో కలిపి మృతుల సంఖ్య కనీసం ఆరుగురికి చేరినట్లు నివేదికలు వెల్లడించాయి&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు రష్యా కూడా ఉక్రెయిన్‌పై క్షిపణులు&comma; డ్రోన్లతో విస్తృత స్థాయిలో దాడులు కొనసాగించింది&period; ఉక్రెయిన్‌లోని ఇంధన&comma; పారిశ్రామిక మౌలిక వసతులను రష్యా లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు తెలిపారు&period; గత ఆరు నెలలుగా రష్యా భూభాగంలో సుదూర దాడులకు ఉక్రెయిన్ బ్రిటిష్ డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి&period; మాస్కోతో పాటు యారోస్లావ్‌&comma; వోల్గోగ్రాడ్ ప్రాంతాల్లోని చమురు శుద్ధి కర్మాగారాలపై కూడా దాడులు జరిగినట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;<p>ఇరు దేశాల పరస్పర దాడులతో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉధృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది&period; భారీ డ్రోన్ దాడులతో రష్యాలోని పలు ప్రాంతాల్లో పౌరులు భయాందోళనలకు గురయ్యారు&period; రష్యా భూభాగంపై ఉక్రెయిన్ దాడుల తీవ్రత పెరగడం&comma; అదే సమయంలో ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతుండటంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి&period; ఇంధన&comma; పారిశ్రామిక మౌలిక వసతులపై దాడులు కొనసాగితే యుద్ధ ప్రభావం మరింత విస్తరించే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ నుంచి ఇంటెన్స్ పోస్టర్.. సెప్టెంబర్ 10న భారీ ఎత్తున చిత్రం విడుదల.

మల్లేపల్లి రూపా రెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ.

ఈ నెల 23న టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్న మేకర్స్.