దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్‌ సేవలు అమోఘం-కేంద్రమంత్రి.

Advertisements

<p>దేశ అంతర్గత భద్రతను కాపాడటంలో సీఆర్పీఎఫ్‌ బలగాలు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్ అన్నారు&period; అన్నమయ్య జిల్లా కలికిరి సీఆర్పీఎఫ్‌ కేంద్రంలో 26 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆఫీసర్స్‌ మెస్‌&comma; సబార్డినేట్‌ ఆఫీసర్స్‌ మెస్‌&comma; రిక్రియేషన్‌ క్లబ్‌&comma; స్టోర్‌ బ్లాక్‌&comma; ట్రేడ్స్‌మెన్‌ బ్లాక్‌ భవన సముదాయాలను కేంద్ర మంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేశారు&period; సీఆర్పీఎఫ్‌ జవాన్ల వల్లే దేశం సురక్షితంగా ఉందనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని పేర్కొన్నారు&period; దేశ భద్రత&comma; సార్వభౌమత్వ పరిరక్షణ కోసం 24 గంటలూ విధులు నిర్వహిస్తున్న జవాన్ల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు&period;<br &sol;>&NewLine;అంతకుమందు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్‌&comma; ఇతర అధికారులు స్వాగతం పలికారు&period; అనంతరం రోడ్డు మార్గంలో కలికిరిలోని సీఆర్పీఎఫ్‌ కేంద్రానికి చేరుకున్న కేంద్ర మంత్రి తొలుత అమరవీరుల స్థూపాన్ని సందర్శించి నివాళులర్పించారు&period; సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు&period;<br &sol;>&NewLine;వీటిలో 9&period;47 కోట్ల రూపాయలతో ఆఫీసర్స్‌ మెస్‌&comma; 7&period;90 కోట్ల రూపాయలతో సబార్డినేట్‌ ఆఫీసర్స్‌ మెస్‌&comma; 4&period;90 కోట్లతో రిక్రియేషన్‌ క్లబ్‌&comma; రూ&period;4&period;55 కోట్లతో స్టోర్‌ బ్లాక్‌ నిర్మించారు&period; ఈ ఆధునిక మౌలిక వసతులు సీఆర్పీఎఫ్‌ అధికారులు&comma; జవాన్లకు మెరుగైన సౌకర్యాలను అందించడంతో పాటు వారి విధి నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంచనున్నాయి&period;ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్‌ జవాన్లు&comma; అధికారులకు అందుతున్న సౌకర్యాలపై కేంద్ర మంత్రి ఆరా తీశారు&period; కొత్తగా నిర్మించిన భవనాలను పరిశీలించి వాటి వినియోగం&comma; నిర్వహణ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ నుంచి ఇంటెన్స్ పోస్టర్.. సెప్టెంబర్ 10న భారీ ఎత్తున చిత్రం విడుదల.

మల్లేపల్లి రూపా రెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ.

ఈ నెల 23న టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్న మేకర్స్.