అంతరిక్ష రంగంలో అమెరికా భారీ టార్గెట్.

Advertisements

<p>అంతరిక్ష రంగంలో అమెరికా మరో భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది&period; ఏడాదికి వెయ్యి అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది&period; వాణిజ్య అంతరిక్ష కార్యక్రమాలను వేగవంతం చేసే కీలక మెమోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు&period; ప్రైవేట్ కంపెనీలతో కలిసి స్పేస్ లాంచ్‌లను భారీగా పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది&period; ప్రస్తుతం అమెరికా అంతరిక్ష ప్రయోగాల సంఖ్యతో పోలిస్తే&period;&period; రాబోయే సంవత్సరాల్లో లక్ష్యాన్ని ఎన్నో రెట్లు పెంచాలని భావిస్తోంది&period; గత ఏడాది అమెరికా నుంచి మొత్తం 178 స్పేస్ లాంచ్‌లు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి&period; 2030 నాటికి ఈ సంఖ్యను ఏకంగా వెయ్యికి చేర్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు&period; వాణిజ్య ఉపగ్రహాలు&comma; కమ్యూనికేషన్ వ్యవస్థలు&comma; శాస్త్రీయ పరిశోధనలు&comma; రక్షణ అవసరాలకు అనుగుణంగా పెరుగుతున్న అంతరిక్ష ప్రయోగాల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అమెరికా ఈ భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది&period; ట్రంప్ సంతకం చేసిన మెమోతో ప్రైవేట్ స్పేస్ కంపెనీలకు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది&period; దీంతో అమెరికా అంతరిక్ష రంగంలో పోటీ మరింత పెరగనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న 22-A వివాదం!

ప.గో.జిల్లా భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం.

వైభవంగా యూనిక్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్ మీట్.