అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.

USHB-1 Visa

Advertisements

<p>అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుంది&period; H-1B వీసాపై లక్షా 3 వేల డాలర్ల వరకు ఫీజు విధించే ప్రతిపాదనలను తీసుకొచ్చింది&period; కోర్టులు గతంలో కొన్ని చర్యలను అడ్డుకున్నప్పటికీ&comma; వీసా విధానాల్లో కఠిన మార్పుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ప్రస్తుతం H-1B వీసా లబ్ధిదారుల్లో దాదాపు 71 శాతం మంది భారతీయులే ఉండటంతో ఈ ప్రతిపాదనలు భారతీయ ఐటీ నిపుణులపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది&period; H-1B వీసాతో పాటు అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు సంబంధించిన F-1 వీసా&comma; యూనివర్సిటీ పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరేందుకు ఉపయోగించే OPT ప్రోగ్రామ్‌పైనా భారీ ఫీజు విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది&period;<&sol;p>&NewLine;<p>అంతేకాకుండా&comma; అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన H-1B వీసాదారులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం&period; H-1B వీసాలకు స్పాన్సర్ చేసే కంపెనీలపై కూడా అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది&period; H-1Bకు సంబంధించిన మొత్తం 3 లక్షలా 99 వేల 402 పిటిషన్లలో సుమారు 71 శాతం భారతీయులవే&period; ఈ మార్పులను ఈ ఏడాది చివరి నాటికి అమలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది&period; అయితే&comma; ఇవి ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే ఉండగా&comma; తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.

శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి.