కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.

Advertisements

<p>కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు&comma; ట్రక్కులు&comma; ఆటోమొబైల్ విడిభాగాలు&comma; స్టీల్‌పై 50 శాతం భారీ దిగుమతి సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు&period; ఈ కొత్త టారిఫ్‌లు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు&period; అమెరికా&comma; కెనడా మధ్య వాణిజ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు&period; కెనడా చాలా ఏళ్లుగా అమెరికాను ఆర్థికంగా దెబ్బతీస్తోందని ట్రంప్ ఆరోపించారు&period; కెనడా ప్రభుత్వం అమెరికా రైతులు&comma; వ్యవసాయ ఉత్పత్తులపై భారీ పన్నులు విధిస్తోందని&comma; దీనివల్ల అమెరికాకు వాణిజ్య లోటు ఏర్పడుతోందని విమర్శించారు&period; అమెరికాలోనే పరిశ్రమలు ఏర్పాటు చేస్తే జీరో టారిఫ్ విధానం ఉంటుందని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>ట్రంప్ నిర్ణయంపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా స్పందించారు&period; అమెరికా తమపై ఆర్థిక దాడికి దిగుతోందని ఆరోపిస్తూ&period;&period; సెప్టెంబర్ 8 నుంచి అమెరికా ఉత్పత్తులపై సమాన స్థాయిలో ప్రతీకార సుంకాలు విధిస్తామని ప్రకటించారు&period; దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తోంది&period; ముఖ్యంగా ఉత్తర అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమకు కీలకమైన సరఫరా గొలుసుపై ఈ టారిఫ్‌à°² ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు&period; వాహనాల ఉత్పత్తి వ్యయం పెరగడంతో భవిష్యత్తులో కార్లు&comma; ఇతర ఆటోమొబైల్ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.

శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి.