ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.

Advertisements

<p>ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు&period; గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది&period; మధ్యాహ్నం 12&period;30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు సుమారు 400 మంది అధికారులతో కూడిన ప్రతినిధి బృందం రానుంది&period; ఢిల్లీ చేరుకున్న అనంతరం సాయంత్రం 5&period;45 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో జిన్‌పింగ్‌ ప్రత్యేకంగా భేటీ కానున్నారు&period; ఈ సమావేశంలో భారత్‌–చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు&comma; సరిహద్దుల్లో శాంతి&comma; స్థిరత్వం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది&period; అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు&comma; ఆర్థిక సహకారం&comma; పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై కూడా సమీక్ష జరగనుంది&period; సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఇరు దేశాల నేతల భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది&period; జిన్‌పింగ్‌ పర్యటనలో భాగంగా భారత్‌&comma; చైనా మధ్య దౌత్యపరమైన చర్చలు జరగనున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.