పాకిస్తాన్లో పుల్వామా దాడుల సూత్రధారి హతం..

పాకిస్తాన్లో పుల్వామా దాడుల సూత్రధారి హతం

Advertisements

<p>పుల్వామా ఉగ్రదాడి కీలక సూత్రధారి హమ్జా బుర్హాన్ హతమయ్యాడు&period; పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కాల్చిచంపారు&period; పుల్వామాకు చెందిన బుర్హాన్‌ ఉన్నత విద్యను అభ్యసించే నెపంతో 2017లో పాకిస్థాన్‌కు వెళ్లాడు&period; తర్వాత నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్-బదర్‌లో చేరి&comma; కొద్ది కాలంలోనే కమాండర్ స్థాయికి ఎదిగాడు&period; అతడిని 2022లో భారత్‌ అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది&period; 2019&comma; ఫిబ్రవరి 14à°¨ సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు&period; ఈ ఉగ్రదాడి ఘటన వెనక పాకిస్థాన్‌ హస్తం గల ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌ ఉన్నట్లు భారత నిఘాసంస్థలు గుర్తించాయి&period; దీనికి ప్రతీకారంగా భారత వాయుసేన ఫిబ్రవరి 26à°¨ వైమానిక దాడులు చేపట్టింది&period; పాక్‌ భూభాగంలోని బాలాకోట్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్ర స్థావరాలపై తెల్లవారుజామున బాంబుల వర్షం కురిపించింది&period; ఆ తర్వాత పాక్‌ ప్రతీకార దాడులు చేపట్టింది&period; మన గగనతలంలోకి వారి యుద్ధ విమానాలు దూసుకొచ్చాయి&period; అయితే పాక్‌ చర్యను భారత వాయుసేన సమర్థవంతంగా తిప్పికొట్టింది&period; ఈ క్రమంలో మన మిగ్‌ విమానం ఒకటి కూలి వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ శత్రుచెరలో చిక్కుకుపోయారు&period; అయితే అంతర్జాతీయ ఒత్తిడితో మూడు రోజుల తర్వాత అభినందన్‌ను పాక్‌ విడిచిపెట్టింది&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..