వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌

Advertisements

<p>మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉక్కుపాదం మోపింది&period; వెనెజువెలాకు చెందిన కరుడుగట్టిన డ్రగ్స్‌ గ్యాంగ్‌ ట్రెన్‌ à°¡à°¿ ఆరాగ్వాపై చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఆ ముఠా కీలక నేత హెక్టర్‌ రస్తెన్‌ఫోర్డ్‌ గురెరో ఫ్లోర్స్‌ హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు&period; ఉగ్రవాదులు&comma; డ్రగ్‌ లార్డ్స్‌కు ప్రపంచంలో ఎక్కడా ఆశ్రయం ఉండదంటూ ట్రంప్‌ హెచ్చరించారు&period;<br &sol;>&NewLine;వెనెజువెలాలో కార్యకలాపాలు సాగిస్తున్న డ్రగ్స్‌ ముఠా ట్రెన్‌ à°¡à°¿ ఆరాగ్వాపై అమెరికా ఈ వారం ప్రారంభంలో కీలక ఆపరేషన్‌ నిర్వహించింది&period; అత్యంత విశ్వసనీయ సమాచారంతో ముఠా సభ్యులు తలదాచుకున్న ఓ కాంపౌండ్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేపట్టింది&period; ఈ దాడిలో గ్యాంగ్‌ లీడర్‌ హెక్టర్‌ రస్తెన్‌ఫోర్డ్‌ గురెరో ఫ్లోర్స్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ వెల్లడించారు&period; ఇందుకు సంబంధించిన వీడియోను వైట్‌హౌస్‌ విడుదల చేసింది&period;<br &sol;>&NewLine;ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందిస్తూ&period;&period; &&num;8220&semi;ట్రెన్‌ à°¡à°¿ ఆరాగ్వా ఉగ్రవాదులకు వెనెజువెలాలోనే కాదు&comma; ఈ భూమ్మీద ఎక్కడా సురక్షిత స్థావరం ఉండదు&period; హంతకులు&comma; డ్రగ్‌ లార్డ్స్‌ ఎక్కడున్నా వేటాడి న్యాయస్థానానికి తీసుకువస్తాం&&num;8221&semi; అని వ్యాఖ్యానించారు&period;ఇప్పటికే ఈ ముఠాను అమెరికా ఉగ్ర సంస్థగా ప్రకటించింది&period; హెక్టర్‌ గురెరో ఫ్లోర్స్‌ తలపై 5 మిలియన్‌ డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది&period; అమెరికాలో డ్రగ్స్‌ అక్రమ రవాణా&comma; హింసాత్మక నేరాల వెనుక ఈ గ్యాంగ్‌ హస్తం ఉందని ఆరోపిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.