అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం.

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం

Advertisements

<p>పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు తెరపడింది&period; అమెరికా&comma; ఇరాన్ దేశాల మధ్య ఎట్టకేలకు చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది&period; ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటిస్తూ&comma; ఈ శాంతి ఒప్పందానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు&period; ఈ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఎలాంటి అదనపు సుంకాలు లేకుండా తెరిచామని ట్రంప్ ప్రకటించారు&period; ఇరాన్ ఓడరేవులపై ఉన్న దిగ్బంధాన్ని తక్షణమే ఎత్తివేయాలని తాను ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు&period; ఈ సందర్భంగా ప్రపంచ వాణిజ్య రంగాన్ని ఉద్దేశించి ట్రంప్ తనదైన శైలిలో&&num;8230&semi; ప్రపంచంలోని నౌకలు&&num;8230&semi; మీ ఇంజిన్లను స్టార్ట్ చేయండి&&num;8230&semi; ఇకపై ఎలాంటి ఆంక్షలు లేకుండా హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాను ప్రారంభించండని పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు&comma; అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఈ శాంతి ఒప్పందాన్ని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ధృవీకరించారు&period; ఈ నెల 19వ తేదీన ఇరు దేశాల ప్రతినిధులు ఈ శాంతి ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు&period; ఇందుకు స్విడ్జర్లాండ్ వేదిక కానుందని పేర్కొన్నారు&period; ఈ ఒప్పందం ప్రకారం&&num;8230&semi; ఇరు దేశాలు తమ మిలటరీ ఆపరేషన్లను పూర్తిగా నిలిపివేస్తాయని షెహబాజ్ స్పష్టం చేశారు&period; యుద్ధ వాతావరణాన్ని తగ్గించేందుకు&comma; ఉద్రిక్తతలకు స్వస్తి పలికేందుకు ఇరు దేశాలు దౌత్యపరమైన అత్యుత్తమ పరిష్కారాన్ని ఎంచుకోవడం అభినందనీయమన్నారు&period; ఈ చారిత్రాత్మక శాంతి ఒప్పందం ఖరారు కావడంలో ఖతార్ దేశం అత్యంత కీలకమైన పాత్ర పోషించిందని పాక్ ప్రధాని కొనియాడారు&period; ఇరు దేశాలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ప్రత్యక్షంగా&comma; పరోక్షంగా సహకరించిన మిగిలిన అన్ని దేశాలకు కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..