కెనడా వెళ్లే భారతీయ విద్యార్థులకు షాక్‌.

కెనడా వెళ్లే భారతీయ విద్యార్థులకు షాక్‌

Advertisements

<p>కెనడాలో చదువుకుని అక్కడే శాశ్వత నివాసం పొందాలని భావించే వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు మానిటోబా ప్రావిన్స్‌ ఊహించని షాకిచ్చింది&period; చదువు పూర్తయ్యాక నేరుగా పర్మినెంట్‌ రెసిడెన్సీ పొందేందుకు ఉపయోగపడుతున్న కీలక ఇమ్మిగ్రేషన్‌ మార్గాన్ని రద్దు చేసింది&period; ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు&period; ఇటీవల కెనడా ప్రభుత్వం విదేశీ విద్యార్థులు&comma; తాత్కాలిక వలసదారుల విషయంలో నిబంధనలు కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;<p>మానిటోబా ప్రావిన్షియల్‌ నామినీ ప్రోగ్రామ్‌ కింద అమల్లో ఉన్న &OpenCurlyQuote;కెరీర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ పాత్‌వే’ ను వెంటనే అమల్లోకి వచ్చేలా రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది&period; ఇప్పటివరకు మానిటోబాలో కనీసం ఏడాది పాటు చదివి&comma; అర్హత కలిగిన ఉద్యోగం సంపాదిస్తే పీఆర్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది&period; ముఖ్యంగా డిగ్రీ&comma; డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఈ మార్గాన్ని ఎక్కువగా వినియోగించుకునేవారు&period; ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో విద్యార్థులు ఇతర ఇమ్మిగ్రేషన్‌ మార్గాలను ఆశ్రయించాల్సి ఉంటుంది&period; ఇకపై చదువు మాత్రమే సరిపోదని&comma; స్థానిక ఉద్యోగ అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని మానిటోబా స్పష్టం చేసింది&period; ప్రస్తుతం అమల్లో ఉన్న స్కిల్డ్‌ వర్కర్‌ ఇన్‌ మానిటోబా ప్రోగ్రామ్‌ కింద కనీసం ఆరు నెలలు ఒకే యజమాని వద్ద పూర్తి స్థాయి ఉద్యోగం చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వనుంది&period; అంటే విద్యార్హతల కంటే ఉద్యోగ అనుభవం&comma; స్థానిక కార్మిక మార్కెట్‌తో అనుసంధానం కీలకంగా మారనున్నాయి&period;<br &sol;>&NewLine;భారతీయ విద్యార్థులకు ఈ నిర్ణయం ప్రత్యేకంగా ప్రభావం చూపే అవకాశం ఉంది&period; మానిటోబాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య గణనీయంగా ఉంది&period; తక్కువ జీవన వ్యయం&comma; మంచి విద్యాసంస్థలు&comma; సులభమైన పీఆర్‌ అవకాశాల కారణంగా చాలా మంది ఈ ప్రావిన్స్‌ను ఎంచుకుంటున్నారు&period; అయితే తాజా నిర్ణయంతో కెనడాలో స్థిరపడాలనుకునే విద్యార్థులు ఇకపై చదువుతో పాటు ఉద్యోగ అనుభవం సంపాదించడంపైనా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..