పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం.

పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం

Advertisements

<p>పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది&period; పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్‌ కుప్పకూలింది&period; మర్దాన్ జిల్లా పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు యువ పైలట్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు&period; సావల్ధేర్ కాట్లాంగ్ రోడ్డు సమీపంలో జరిగింది ఈ ఘటన&period; సాధారణ శిక్షణ రౌండ్‌లో భాగంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది&period; మృతులు మహ్మద్ ఖాసిం అబ్దుల్లా&comma; తాహా అబ్బాసిగా ఆర్మీ ధ్రువీకరించింది&period; వీరు ఇద్దరూ విధి నిర్వహణలోనే వీరమరణం పొందారని ఐఎస్‌పీఆర్ పేర్కొంది&period;<&sol;p>&NewLine;<p>ఐతే విమానం నియంత్రణ కోల్పోతున్న సమయంలో పైలట్లు ఇద్దరూ అత్యంత సాహసోపేతంగా వ్యవహరించారు&period; విమానం ఇళ్లపై పడకుండా అప్రమత్తంగా వ్యవహరించారు&period; ఇళ్లపై పడి ఉంటే భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానిక అధికారులు తెలిపారు&period; పైలట్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి విమానాన్ని నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న ఖాళీ రోడ్డు పక్కన ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారని వెల్లడించారు&period; అయితే వేగంగా వచ్చి భూమిని ఢీకొట్టడంతో విమానం ముక్కలైంది&period; విమాన శిథిలాలు ఎగిరిపడటంతో రోడ్డుపై వెళ్తున్న ముగ్గురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు&period; వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు&period; విమానం కూలిపోవడానికి గల అసలు కారణాలపై దర్యాప్తుకు ఎయిర్ హెడ్‌క్వార్టర్స్ ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది&period; కొద్ది రోజుల క్రితమే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సైనిక హెలికాప్టర్ కూలి పలువురు సైనికులు మరణించిన ఘటన మరువక ముందే&period;&period; ఇప్పుడు మళ్లీ మరో శిక్షణ విమానం కూలిపోవడం పాక్ రక్షణ రంగంలో ఆందోళన కలిగిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..