రష్యాకు చెందిన బాంబర్ విమానానికి ప్రమాదం.

రష్యాకు చెందిన బాంబర్ విమానానికి ప్రమాదం

Advertisements

<p>రష్యాకు చెందిన వ్యూహాత్మక బాంబర్ విమానం సైబీరియాలో కుప్పకూలింది&period; ఒక శిక్షణ విమానానికి ప్రమాదం జరిగినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది&period; ప్రమాదాన్ని ముందే గమనించిన సిబ్బంది అప్రమత్తం అయ్యారు&period; బ్యాక్‌ఫైర్ అని పిలవబడే Tu-22 విమానం&comma; సోవియట్ కాలం నాటి సూపర్ సోనిక్ బాంబర్&period; రష్యా దీనిని సిరియా&comma; ఉక్రెయిన్‌లలో సైనిక చర్యల కోసం ఉపయోగిస్తోంది&period; ఇది హైపర్‌సోనిక్ కింజాల్ క్షిపణులను మోసుకెళ్లగలదు&period; అంగారా నది ఒడ్డుకు సమీపంలోని&comma; కామెంకా గ్రామం వద్ద ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ విమానం కూలిపోయింది&period; విమానం ఎటువంటి యుద్ధ సామాగ్రి లేకుండా ప్రయాణిస్తుండటం వల్ల పెద్దగా ఆస్తి నష్టం జరగలేదు&period; ప్రాణాపాయం నుండి తప్పించుకున్న నలుగురు సభ్యులను ఆసుపత్రికి తరలించారు&period; వారికి ప్రాణాపాయం లేదని స్థానిక గవర్నర్ ఇగోర్ కోబ్జెవ్ తెలిపారు&period; ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంజన్ వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.