అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం రద్దు.

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం రద్దు అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం రద్దు

Advertisements

<p>స్విట్జర్లాండ్ వేదికగా జరగాల్సిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభం కాకముందే రద్దయ్యాయి&period; ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు జరిగిన ఈ ప్రయత్నాలు తీవ్ర ఉద్రిక్తతల నడుమ అర్ధాంతరంగా ముగిశాయి&period; శాంతి ఒప్పందం కోసం స్విట్జర్లాండ్‌కు అమెరికా తరఫున జేడీ వాన్స్ బృందం వెళ్లింది&period; అయితే&comma; ఈ చర్చలు ప్రారంభం కావడానికి ముందే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన కొన్ని హెచ్చరికలు వాతావరణాన్ని వేడెక్కించాయి&period; ట్రంప్ వ్యాఖ్యలపై ఇరుదేశాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది&period; దీనితో ఆగ్రహానికి గురైన ఇరాన్ ప్రతినిధులు&comma; జేడీ వాన్స్‌ను కనీసం కలవకుండానే అక్కడి నుండి వెనుదిరిగారు&period; చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌కు ఇరాన్ బృందం తమ నిర్ణయాన్ని తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయింది&period; ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో తాము చర్చల్లో కూర్చోబోమని స్పష్టం చేస్తూ ఇరాన్ ప్రతినిధులు నిష్క్రమించారు&period; వెనుదిరిగే సమయంలో ఇరాన్ ఒక కీలక ప్రకటన చేసింది&period; లెబనాన్‌పై జరుగుతున్న యుద్ధాన్ని తక్షణమే ఆపితేనే అమెరికాతో శాంతి చర్చలు జరుపుతామని ఇరాన్ కరాఖండిగా తేల్చి చెప్పింది&period; ఆ షరతు నెరవేరితేనే భవిష్యత్తులో చర్చల గురించి ఆలోచిస్తామని స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;<p>అమెరికా-ఇరాన్ మధ్య కుదరాల్సిన శాంతి ఒప్పందం ఇలా రద్దు కావడంతో అంతర్జాతీయ మార్కెట్‌పై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది&period; మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో&comma; మరోసారి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరగనున్నాయి&period; ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై&comma; ముఖ్యంగా ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.