ఎట్టకేలకు తెరుచుకున్న హర్మూజ్ జలసంధి.

ఎట్టకేలకు తెరుచుకున్న హర్మూజ్ జలసంధి

Advertisements

<p>అంతర్జాతీయంగా ఇంధన రవాణా మార్గాల్లో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ఎట్టకేలకు తిరిగి తెరుచుకుంది&period; అమెరికా&comma; ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక అవగాహన ఒప్పందం తర్వాత ఈ జలసంధి గుండా నౌకల రాకపోకలు పున&colon;ప్రారంభమయ్యాయి&period; తాజా పరిణామంతో భారత్‌కు ముడిచమురు&comma; ఇతర సరుకులతో వస్తున్న 11 వాణిజ్య నౌకలు సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటేశాయి&period; గత కొన్ని రోజులుగా అమెరికా&comma; ఇరాన్ దేశాల మధ్య పెరిగిన తీవ్ర ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ జలసంధి నుంచి రవాణా పూర్తిగా నిలిచిపోయింది&period; దీంతో అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ స్తంభించిపోవడంతో పాటు భారత్ వంటి ప్రధాన దిగుమతి దేశాలపై తీవ్ర ఒత్తిడి పడింది&period; తాజాగా ఇరు దేశాల దౌత్యవేత్తలు జరిపిన చర్చలు విజయవంతం అవ్వడంతో హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ సమ్మతించింది&period; దీంతో భారత్‌కు వస్తున్న మొదటి విడత 11 కార్గో&comma; ఆయిల్ ట్యాంకర్ నౌకలు హర్మూజ్ జలసంధిని దాటి భారత్ వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి&period; ఈ పరిణామం భారత ఇంధన మార్కెట్‌కు&comma; చమురు శుద్ధి సంస్థలకు గొప్ప ఊరటనివ్వనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.