అమెరికా-ఇరాన్ చర్చల తర్వాత హర్మూజ్ మార్గం క్లియర్.

అమెరికా-ఇరాన్ చర్చల తర్వాత హర్మూజ్ మార్గం క్లియర్

Advertisements

<p>ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి&period; అమెరికా&comma; ఇరాన్ దేశాల మధ్య జరిగిన దౌత్యపరమైన చర్చలు సఫలం కావడంతో ఈ సముద్ర మార్గంలో నౌకల రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి&period; ఈ పరిణామం భారతదేశానికి పెద్ద ఊరటనిచ్చింది&period; భారత్‌కు వస్తున్న 30 నౌకలు ఇప్పటికే సురక్షితంగా ఈ జలసంధిని దాటాయని&comma; మరో 26 నౌకలు ప్రయాణ అనుమతి కోసం వేచి ఉన్నాయని భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి&period; పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి వచ్చే ముడిచమురు&comma; ఎల్పీజీ&comma; వ్యవసాయానికి అవసరమైన ఎరువుల సరఫరా కోసం భారతదేశం ప్రధానంగా ఈ మార్గంపైనే ఆధారపడుతోంది&period; తాజా పరిణామాలతో దేశంలో ఇంధన భద్రతకు ఉన్న ముప్పు తప్పినట్లయింది&period;<&sol;p>&NewLine;<p>ఇటీవలి ప్రాంతీయ ఘర్షణల కారణంగా ఇరాన్ ఈ జలసంధిపై పట్టు బిగించి&comma; నౌకల రాకపోకలను అడ్డుకోవడంతో వందలాది నౌకలు పర్షియన్ గల్ఫ్‌లోనే నిలిచిపోయాయి&period; అయితే&comma; అమెరికా-ఇరాన్ ఒప్పందం ప్రకారం ప్రస్తుతం రాకపోకలను క్రమంగా పునరుద్ధరిస్తున్నారు&period; ఇంకా వేచి ఉన్న 26 భారతీయ నౌకల్లో 3 నౌకలు ఇంధన లోడుతో&comma; 10 నౌకలు ఎరువులతో&comma; మిగిలిన 13 నౌకలు ఇతర నిత్యావసర వస్తువులతో ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయి&period;<br &sol;>&NewLine;ఇప్పటికే అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ కి చెందిన రెండు భారీ ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్లు సురక్షితంగా ప్రయాణించి తమిళనాడులోని ఎన్నూర్&comma; కేరళలోని కొచ్చి టెర్మినల్స్‌కు గ్యాస్ చేరవేశాయి&period;<&sol;p>&NewLine;<p>హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా సాఫీగా సాగితే దేశంలో ఇంధన ధరలు స్థిరపడతాయని&comma; ఎరువుల కొరత తీరి వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు&period; అయితే&comma; యుద్ధం ముగిసినప్పటికీ బీమా ఖర్చులు పెరగడం&comma; సముద్రంలో మైన్ల తొలగింపు వంటి సవాళ్లు ఉన్నందున రవాణా పూర్వస్థితికి రావడానికి మరికొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉంది&period; ప్రస్తుతం భారత ప్రభుత్వం తన నౌకాదళం ద్వారా &OpenCurlyQuote;ఆపరేషన్ ఊర్జా సురక్ష’ను నిర్వహిస్తూ&comma; భారతీయ నౌకలకు రక్షణ కల్పిస్తూ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .