అదానీ కేసును వెంటనే కొట్టివేయడానికి అమెరికా కోర్టు నిరాకరణ.

Advertisements

<p>అపర కుబేరుడు గౌతమ్ అదానీపై నమోదైన హై-ప్రొఫైల్ లంచం కేసులో అమెరికా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది&period; అదానీతో పాటు ఇతర నిందితులపై ఉన్న క్రిమినల్ ఆరోపణలను తక్షణమే కొట్టివేయడానికి అమెరికా ఫెడరల్ జడ్జి నిరాకరించారు&period; ఈ కేసును ఎందుకు ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారో మరింత స్పష్టమైన&comma; వివరణాత్మకమైన నివేదికను సమర్పించాల్సిందిగా<br &sol;>&NewLine;న్యాయశాఖను కోర్టు ఆదేశించింది&period; బ్రూక్లిన్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి నికోలస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు&period; కేసును ఉపసంహరించుకోవాలంటూ మే 18à°¨ జస్టిస్ డిపార్ట్‌మెంట్ దాఖలు చేసిన పిటిషన్ చాలా క్లుప్తంగా&comma; ఎలాంటి బలమైన కారణాలు లేకుండా ఉందంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు&period; కేసును ఎందుకు డ్రాప్ చేయాలనుకుంటున్నారో సరైన ఆధారాలు&comma; కారణాలతో కూడిన నివేదికను జూలై 13 లోగా కోర్టుకు సమర్పించాలని ప్రాసిక్యూటర్లను ఆదేశించారు&period;<&sol;p>&NewLine;<p>భారత్‌లో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఆమోదం కోసం ప్రభుత్వ అధికారులకు వందల మిలియన్ డాలర్ల లంచాలు ఇవ్వడానికి ప్రయత్నించారని&comma; అలాగే అమెరికా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారని గౌతమ్ అదానీ&comma; ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై 2024లో అమెరికాలో కేసు నమోదైంది&period; అయితే ఈ ఆరోపణలన్నింటినీ అదానీ గ్రూప్ మొదటి నుంచీ తీవ్రంగా ఖండిస్తూనే ఉంది&period; ఐతే ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత&comma; ఈ కేసుపై మరింత సమయం&comma; వనరులను కేటాయించలేమని పేర్కొంటూ కేసును పూర్తిగా ఉపసంహరించుకోవాలని జస్టిస్ డిపార్ట్‌మెంట్ భావించింది&period; జూన్ 24à°¨ అదానీ తరపు న్యాయవాదులు కూడా ఈ కేసు అమెరికా అధికార పరిధిలోకి రాదని&comma; లంచం ఇచ్చినట్లు నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ కేసును అధికారికంగా కొట్టివేయాలని కోర్టును కోరారు&period; అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం నుంచి పూర్తి వివరణ కావాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>ఇదిలా ఉంటే&period;&period; దీనికి సమాంతరంగా నడుస్తున్న సివిల్ వివాదాల పరిష్కారానికి అదానీ గ్రూప్ అంగీకరించింది&period; ఇందులో భాగంగా గౌతమ్ అదానీ 6 మిలియన్ డాలర్లు&comma; సాగర్ అదానీ 12 మిలియన్ డాలర్ల మేర&period;&period; సివిల్ సెటిల్‌మెంట్ కింద చెల్లించే ప్రతిపాదనలు కోర్టు అనుమతి కోసం వేచి ఉన్నాయి&period; ఇవి కాకుండా&comma; ఇరాన్ నుంచి ఎల్పీజీ దిగుమతులకు సంబంధించి అమెరికా ఆంక్షలను ఉల్లంఘించారనే ఆరోపణల పరిష్కారానికి గాను&period;&period;అదానీ ఎంటర్‌ప్రైజెస్ అమెరికా ట్రెజరీకి 275 మిలియన్ డాలర్లు చెల్లించడానికి అంగీకరించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.