ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంపై మరోసారి అనిశ్చితి.

ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంపై మరోసారి అనిశ్చితి

Advertisements

<p>పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి&period; ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంపై మరోసారి అనిశ్చితి ఏర్పడింది&period; ఇరాన్‌పై భీకర దాడులతో విరుచుకుపడింది అమెరికా&period; ప్రతీకార దాడులకు దిగింది&period; హర్మూజ్‌ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై ఇరాన్‌ డ్రోన్లతో దాడి చేసింది&period; దీనికి ప్రతీకారంగా యూఎస్‌ తాజాగా దాడులు చేపట్టింది&period; హర్మూజ్‌కు సమీపంలోని ఇరాన్‌ మిలటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది&period; ఇరాన్‌కు చెందిన క్షిపణి&comma; డ్రోన్&comma; రాడార్ సైట్లపై తమ యుద్ధవిమానాలు దాడులు చేశాయని వెల్లడించింది అమెరికా&period; ఇదిలా ఉంటే&period;&period;ఇరాన్‌పై ప్రతీకార దాడికి ముందు స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌&period;&period;హర్మూజ్‌లో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడి చేయడం తెలివి తక్కువ పనేనని విమర్శించారు&period; దీనికి అమెరికా బదులు తీర్చుకుంటుందని పేర్కొన్నారు&period; ట్రంప్‌ ప్రకటన వెలువడిన అనంతరం అమెరికా యుద్ధవిమానాలతో దాడులకు దిగింది&period; దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి&period; ఇటీవలే అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతిఒప్పందం కుదిరింది&period; అయితే తాజా దాడులతో ఒప్పందం మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.