పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి.

Advertisements

<p>పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి&period; అమెరికా&comma; ఇరాన్ దేశాల మధ్య ఇటీవల తాత్కాలిక కాల్పుల ఒప్పందం జరిగినప్పటికీ&period;&period; మళ్లీ పరిస్థితులు మొదటికే వచ్చేలా కనిపిస్తున్నాయి&period; ఇరాన్ ఓ నౌకపై దాడి చేసి కాల్పుల విరమణను ఉల్లంఘించిందనే కారణంతో అమెరికా భీకర దాడులు చేసింది&period; దీనికి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ &lpar;ఐఆర్‌జీసీ&rpar; కూడా గట్టిగానే బదులు ఇచ్చింది&period; కువైట్&comma; బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు&comma; క్షిపణులతో దాడులకు దిగింది&period; అమెరికా ఇంకా తన దాడులను కొనసాగిస్తే యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న చర్చలు పూర్తిగా నిలిచిపోతాయి అని ఇరాన్ హెచ్చరించింది&period;<&sol;p>&NewLine;<p>ఖతార్ నుంచి బయలుదేరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నౌకాశ్రయానికి హోర్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న ఓ అంతర్జాతీయ నౌకపై గత శనివారం తెల్లవారుజామున ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది&period; ఆ ఖరీదైన నౌక కొంత దెబ్బతిన్నప్పటికీ అది తన ప్రయాణాన్ని కొనసాగించింది&period; ఆ డ్రోన్లను అప్పుడే నాశనం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు&period; ఈ దాడితో ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; అయితే ఈ దాడికి ప్రతిగా దక్షిణ ఇరాన్‌లోని సిరిక్ ప్రాంతంలో అమెరికా దాడులకు దిగింది&period; ఇందులో సిరిక్&comma; బందర్-ఎ లెంగెహ్&period; కేశ్మ్ ఐలాండ్ లలోని ఇరాన్ స్థావరాలపై అమెరికా యుద్ద విమానాలు బాంబుల వర్షం కురిపించాయి&period; అలాగే కేశ్మ్ దీవులలో ఉన్న ఇరాన్ నిఘా వ్యవస్థలు&comma; క్షిపణి&period; డ్రోన్ నిల్వ కేంద్రాలు&comma; కోస్టల్ రాడార్ సైట్లపై దాడులు చేసింది&period; కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించే అవకాశం ఇరాన్‌కు లభించిందని&comma; కానీ కికు నౌకపై దాడి చేసి ఆ దేశం దానిని వదులుకుందని అమెరికా సైన్యం తెలిపింది&period;<&sol;p>&NewLine;<p>అమెరికా చేసిన దాడులకు ప్రతీకారంగా ఐఆర్‌జీసీ ఎదురుదాడులకు దిగింది&period; బెహ్రెయిన్&comma; కువైట్‌లో ఉన్న అమెరికా స్థావారలపై దాడులు చేసింది&period; బహ్రెయిన్‌లోని అమెరికా నేవీకి చెందిన 5à°µ ఫ్లీట్ బేస్‌ను టార్గెట్ చేసుకొని క్షిపణి దాడి చేసింది&period; దీంతో ఆ దేశవ్యాప్తంగా సైరన్లు మోగాయి&period; ఓ క్షిపణి రాజధాని మనామాలోని ఒక నివాస భవనాన్ని తాకడంతో కొంత ధ్వంసం అయ్యింది&period; అలాగే కువైట్‌లోని అమెరికా మెయిన్ ఆర్మీ బేస్ అయిన అలీ అల్-సలేంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది&period; అయితే కువైట్ ఎయిర్ డిఫెన్స్ వాటిని గాలిలోనే పేల్చేశాయి&period;<&sol;p>&NewLine;<p>ఇరాన్ దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ పదే పదే ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు&period; ఇక తాము శాంతియుతంగా ఉండలేమని ఆసహనం వ్యక్తం చేశారు&period; తాము సైనిక పరంగా మొదలుపెట్టిన పనిని పూర్తి చేయాల్సి వస్తుందని అన్నారు&period; అదే జరిగితే ఇక ఇరాన్ ఉనికే ఉండదని&comma; దాని ఆనవాళ్లు భూమిపై కనిపించవని సీరియస్‌గా హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.