ఇజ్రాయెల్ వైమానిక దాడిపై జో బైడెన్(Joe Biden) దిగ్బ్రాంతి వ్యక్తం..
గాజా(Gaza)లో సైనిక చర్య పేరిట భీకర దాడులతో అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న ఇజ్రాయెల్(Israel)పై అగ్రరాజ్యం అమెరికా(America) మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గాజాలో పౌరుల రక్షణ కోసం ఇజ్రాయెల్ తగిన చర్యలు తీసుకోలేదని అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో గాజాలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఏడుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో బైడెన్ ఈ విధంగా ఘాటుగా స్పందించారు.
ఇది చదవండి: అమెరికాలో ఘోర ప్రమాదం..!
ఇజ్రాయెల్ వైమానిక దాడిపై బైడెన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఏడుగురు స్వచ్ఛంధ సేవా సంస్థ సహాయకులు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని అన్నారు. మృతులంతా యుద్ధ పరిస్థితుల్లో ఆకలితో అలమటిస్తున్నవారికి సహాయాన్ని అందించినవారేనని అన్నారు. ధైర్యంగా, నిస్వార్థంగా సాయం చేసినవారు మృతి చెందడం తీరని లోటు అని బైడెన్ వ్యాఖ్యానించారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి