టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతుండగా, ఊహించని సంఘటన జరిగింది. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 14వ ఓవర్ వద్ద ఓ యువకుడు మైదానంలోకి చొరబడ్డాడు. భద్రతా వలయాన్ని తప్పించుకుని వచ్చిన అతడు బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ వద్దకు పరుగు తీశాడు. కోహ్లీ భుజంపై చేయి వేసి మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఇంతలో మైదాన సిబ్బంది వచ్చి అతడిని బయటికి తీసుకెళ్లారు. అతడు ధరించిన టీషర్టుపై పాలస్తీనాపై బాంబులు వేయడం ఆపండి. పాలస్తీనాకి విముక్తి కల్పించండి అని రాసి ఉంది. చేతిలో పాలస్తీనా జెండా పట్టుకుని వచ్చాడు. ఆ యువకుడు మాస్క్ ధరించి ఉండగా, ఆ మాస్క్ పై కూడా పాలస్తీనా జెండా ముద్రించి ఉంది. అతడిని మైదాన సిబ్బంది బయటికి తీసుకెళ్లిన అనంతరం మ్యాచ్ మళ్లీ మొదలైంది.
Read Also..
Read Also..