ముంబై ఇండియన్స్ (Mumbai Indians) :
ఐపీఎల్ 2024 (IPL 2024)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చంఢీగఢ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 9 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్ 183 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పంజాబ్ యువ బ్యాటర్ అశుతోశ్ శర్మ అద్భుతంగా పోరాడినప్పటికీ విజయం ముంబైనే వరించింది. 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో అశుతోశ్ శర్మ తన జట్టు గెలుపు ముంగిటకు తీసుకొచ్చాడు. 28 బంతుల్లో 61 పరుగులు బాదాడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అందులో ఏకంగా 7 సిక్సర్లు ఉన్నాయి. అయితే చివరిలో అతడు ఔట్ కావడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. ముంబై బౌలర్లలో కోయిట్జి, బుమ్రా, ఆకాశ్ మధ్వల్ తలో మూడు వికెట్లు తీయగా.. ఒక వికెట్ రనౌట్ రూపంలో లభించింది. పంజాబ్ బ్యాటర్లలో సామ్ కర్రాన్ 6, ప్రభ్సిమ్రాన్ సింగ్ 0, రూసో 1, లియామ్ లివింగ్‌స్టోన్ 1, హర్‌ప్రీత్ సింగ్ భాటియా13, శంకర్ సింగ్ 41, జితేశ్ శర్మ9, ఆశ్‌తోశ్ శర్మ 61, హర్‌ప్రీత్ బ్రార్ 19, కగిసో రబాడ 8 అర్షదీప్ సింగ్ 1 చొప్పున పరుగులు చేశారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
- బ్రిక్స్ సదస్సు సందర్భంగా పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.బ్రిక్స్ సదస్సు-2026 నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, పుతిన్‌కు ఒక విశిష్టమైన సాంస్కృతిక కానుకను అందజేశారు. ప్రాచీన తమిళ సాహిత్య గ్రంథమైన…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో విజయం…