Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home International ఐపీఎల్ స్టార్ట్…. ధోని vs కోహ్లీ

ఐపీఎల్ స్టార్ట్…. ధోని vs కోహ్లీ

by Prakash
IPL

ఐపీఎల్ (IPL)

ఐపీఎల్ (IPL) సందడి వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఈ లీగ్ నేటి నుంచి షురూ కానుంది. తొలి సమరంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దాదాపు 2 నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక ఏకంగా 17కోట్ల 50 లక్షలతో ముంబై నుంచి దక్కించుకున్న కామెరాన్ గ్రీన్‌పై బెంగళూరు చాలా ఆశలు పెట్టుకుంది. మరోవైపు తొలి మ్యాచ్‌కు ఒక రోజు ముందు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. దీంతో నూతన సారధి రుతురాజ్ గైక్వాడ్‌ సారధ్యంలో ఆ జట్టు ముందుకు సాగనుంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

వన్డే వరల్డ్ కప్‌లో ఔరా అనిపించిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శార్దూల్ ఠాకూర్‌లు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడబోతున్నారు.
రెండు బలమైన జట్లు పోటీపడుతుండటంతో ఓపెనింగ్ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్‌ను విజయంతో మొదలుపెట్టాలనే లక్ష్యంతో ఇరు జట్లు మైదానంలో అడుగుపెట్టబోతున్నాయి. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో సీఎస్కే బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్‌తోనే గైక్వాడ్‌కు కఠిన పరీక్ష ఎదురైంది. బెంగళూరుతో మ్యాచ్‌లో కెప్టెన్‌గా అతను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


భారత క్రికెట్ జట్టు మరో అరుదైన అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది.
భారత క్రికెట్ జట్టు మరో అరుదైన అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. జపాన్‌తో తొలిసారి ప్రత్యేక టీ20 …
మంధాన విధ్వంసం.. హాంకాంగ్‌పై భారత్‌ భారీ విజయం.
మంధాన విధ్వంసం.. హాంకాంగ్‌పై భారత్‌ భారీ విజయం. ఈ విజయంతో ఈ గ్రూప్‌ నుంచి సెమీఫైనల్‌ …
విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ ప్లేయర్స్ ఆక్షన్.
మహిళల ఏపీ ప్రీమియర్ లీగ్ ప్లేయర్స్ ఆక్షన్‌కు సర్వం సిద్ధమైంది. విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: