అమెరికా(America) అధికార పీఠాన్ని రెండోసారి దక్కించుకునేందుకు బరిలోకి దిగిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తాజాగా కోర్టులో 1,460 కోట్ల బాండ్ సమర్పించారు. తద్వారా తనకు విధించిన 454 మిలియన్ డాలర్ల జరిమానా విషయంలో తదుపరి చర్యలు తీసుకోకుండా కోర్టు ఆదేశాల మేరకు నడుచుకొన్నారు. దీంతో ప్రభుత్వం ఆయన ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉండదు. ట్రంప్ తన ఆస్తుల మొత్తాన్ని వాస్తవిక విలువ కంటే అధికంగా చూపి బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇది చదవండి: తైవాన్లో భారీ భూకంపం..!
కొన్నేళ్ల పాటు ఇలా మోసపూరితంగా వ్యాపార రుణాలు, బీమా పొందారన్న అభియోగాలపై కేసు నమోదైంది. ఒకవేళ పైకోర్టులో ట్రంప్ దోషిగా తేలితే.. తాజాగా దాఖలు చేసిన 1460 కోట్ల రూపాయల బాండ్ ఆయనకు తిరిగి రాదు. ఒకవేళ నిర్దోషిగా తేలితే ఆయన బాండును తిరిగి ఇచ్చేస్తారు. దీనిపై సెప్టెంబరులో వాదనలు జరగనున్నాయి. తనపై వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని ట్రంప్ తొలి నుంచి వాదిస్తూ వస్తున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి