America:
అమెరికాలో బ్రిడ్జి(Bridge) కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాల్టిమోర్(Baltimore)లో ఓ కంటెయినర్ ఓడ.. నదిలో స్టీల్ వంతెనను ఢీ కొట్టగా బ్రిడ్జి పేకమేడలా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ క్రమంలో వంతెనపై ప్రయాణిస్తున్న కార్లు నదిలో పడిపోయాయి. ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. అమెరికాలోని బాల్టిమోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పటాప్స్కో నదిలో బాల్టిమోర్ నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళుతున్న కంటెయినర్ ఓడ, మార్గమధ్యలో నదిపై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ వంతెనను ఢీ కొట్టింది. నదిలో పడిన వారిని కాపాడేందుకు సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. కార్లలో గల్లంతైన వారు కచ్చితంగా ఎంతమందో తెలియదని సిబ్బంది తెలిపారు. మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వంతెన కూలిపోవడం వల్ల బాల్టిమోర్ నౌకాశ్రయానికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ స్తంభించగా, అధికారులు వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: Virat Kohli T20 : టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ..!
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి