ఎర్ర సముద్ర మార్గంలో నౌకలపై హౌతి దాడులు:
ఎర్ర సముద్రం(Red Sea)లో ఇరాన్ సహకారంతో యెమెన్ తిరుగుబాటు గ్రూపు హౌతి రెబల్స్ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో వాణిజ్య నౌక(Commercial Ship)పై హౌతీ రెబల్స్ క్షిపణి దాడి చేశారు. ఈ ఘటనలో నౌకలోని ముగ్గురు సిబ్బంది చనిపోయారు. వాణిజ్య రవాణాతో అత్యంత రద్దీగా ఉండే ఎర్ర సముద్ర(Red Sea) మార్గంలో నౌకలపై హౌతి దాడు(Houthi attack)లు చేయడం మొదలుపెట్టాక నౌకా సిబ్బంది చనిపోవడం ఇదే తొలిసారి.
బ్రిటన్, అమెరికా అధికారుల వెల్లడి..
జరిగిన దాడిలో ముగ్గురు అమాయక సిబ్బంది చనిపోయారని బ్రిటన్(Britain), అమెరికా(America) అధికారులు తెలిపారు. అమాయక సిబ్బంది చనిపోయారని ఎక్స్ వేదికగా బ్రిటన్(Britain) రాయబార కార్యాలయం ప్రకటించింది. అంతర్జాతీయ షిప్పింగ్ లక్ష్యంగా క్షిపణులతో దాడులు చేయడం విచారకరమని, తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన నౌకా సిబ్బంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంది.
దాడికి బాధ్యత వహిస్తున్నామని ప్రకటించిన హౌతీ..
కాగా ఈ దాడి తమదేనని హౌతీ బాధ్యత వహించింది. యెమెన్‌లోని ఏడెన్ పోర్టుకు 50 నాటికల్ మైళ్ల దూరంలో బార్బడోస్ జెండాతో ఉన్న ట్రూ కాన్ఫిడెన్స్ షిప్ దగ్దమైపోయిందని పేర్కొంది. కాగా అమెరికా సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ.. గాజాలో యుద్ధానికి సంఘీభావంగా హౌతీ రెబల్స్ గతేడాది నవంబర్ నుంచి ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. బ్రిటన్, అమెరికా దేశాల హౌతీలపై ప్రతీకార దాడులు మొదలు పెట్టాయని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: అగ్రస్థానానికి దూసుకెళ్లిన టీమిండియా
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్తెలుగువాట్సాప్ఛానల్నుఫాలోఅవ్వండి