ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నహౌతీ మిలిటెంట్లకు అమెరికా, బ్రిటన్ సంయుక్త దళాలు షాక్ ఇచ్చాయి. హౌతీలకు చెందిన డజన్ల కొద్దీ డ్రోన్లను కూల్చివేసినట్లు అమెరికా మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది. హౌతీలకు చెందిన 28 దాకా అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్ ను ఎర్ర సముద్రంలో కూల్చివేశాం అని పేర్కొంది. హౌతీల దాడిలో అమెరికా సంయుక్త దళాల నౌకలతో పాటు వాణిజ్య నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదు అని US సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా హౌతీలు ఎర్ర సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ వద్ద అమెరికా, ఇజ్రాయెల్‌లకు చెందిన వాణిజ్య నౌకలపై డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేస్తున్నారు. ఈ దాడులు గత ఏడాది నవంబర్ నుంచి మొదలయ్యాయి. వీటిని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సంయుక్త దళాలు తిప్పికొడుతున్నాయి.
red sea
ఎర్ర సముద్ర మార్గంలో నౌకలపై హౌతి దాడులు:
ఎర్ర సముద్రం(Red Sea)లో ఇరాన్ సహకారంతో యెమెన్ తిరుగుబాటు గ్రూపు హౌతి రెబల్స్ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో వాణిజ్య నౌక(Commercial Ship)పై హౌతీ రెబల్స్ క్షిపణి దాడి చేశారు. ఈ ఘటనలో నౌకలోని ముగ్గురు సిబ్బంది చనిపోయారు. వాణిజ్య రవాణాతో అత్యంత రద్దీగా ఉండే ఎర్ర సముద్ర(Red Sea) మార్గంలో నౌకలపై హౌతి దాడు(Houthi attack)లు చేయడం మొదలుపెట్టాక నౌకా సిబ్బంది చనిపోవడం ఇదే తొలిసారి.
బ్రిటన్, అమెరికా అధికారుల వెల్లడి..
జరిగిన దాడిలో ముగ్గురు అమాయక సిబ్బంది చనిపోయారని బ్రిటన్(Britain), అమెరికా(America) అధికారులు తెలిపారు. అమాయక సిబ్బంది చనిపోయారని ఎక్స్ వేదికగా బ్రిటన్(Britain) రాయబార కార్యాలయం ప్రకటించింది. అంతర్జాతీయ షిప్పింగ్ లక్ష్యంగా క్షిపణులతో దాడులు చేయడం విచారకరమని, తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన నౌకా సిబ్బంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంది.
దాడికి బాధ్యత వహిస్తున్నామని ప్రకటించిన హౌతీ..
కాగా ఈ దాడి తమదేనని హౌతీ బాధ్యత వహించింది. యెమెన్‌లోని ఏడెన్ పోర్టుకు 50 నాటికల్ మైళ్ల దూరంలో బార్బడోస్ జెండాతో ఉన్న ట్రూ కాన్ఫిడెన్స్ షిప్ దగ్దమైపోయిందని పేర్కొంది. కాగా అమెరికా సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ.. గాజాలో యుద్ధానికి సంఘీభావంగా హౌతీ రెబల్స్ గతేడాది నవంబర్ నుంచి ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. బ్రిటన్, అమెరికా దేశాల హౌతీలపై ప్రతీకార దాడులు మొదలు పెట్టాయని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: అగ్రస్థానానికి దూసుకెళ్లిన టీమిండియా
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్తెలుగువాట్సాప్ఛానల్నుఫాలోఅవ్వండి
పుదుచ్చేరి వద్ద సముద్రం నీరు ఎర్రని రంగులోకి మారడం స్థానికులు, పర్యాటకులకు ఆందోళన కలిగిస్తోంది. గత నాలుగైదు రోజులుగా సముద్రపు నీటిలో రంగుమార్పుతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఎందుకిలా జరుగుతోందో అర్థంకాక టెన్షన్ పడుతున్నారు. ఈ మార్పులపై కొందరు ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు రంగుమారిన సముద్రపు నీటి శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. ఇటీవల విశాఖపట్నం బీచ్ వద్ద కూడా సముద్రపు నీరు నల్లగా మారడంతో కలకలం రేగింది. తమిళనాడులోని పలు బీచ్‌ల్లోనూ సముద్రపు నీటి రంగు మారడం చర్చనీయాంశంగా మారింది. శాస్త్రవేత్తల ప్రకారం, నీటిలో ఆల్గే వంటి సూక్ష్మజీవులు ఉన్నా లేదా ఇతర పరార్థాలు ఉన్నా రంగు మారే అవకాశం ఉందని అంటున్నారు. వాతావరణ మార్పుల కారణంగా కూడా సముద్రపు నీటి రంగు మారే అవకాశం ఉన్నట్టు ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో తేలిసింది.




Total views : 62249