కర్ణాటకలోని చిత్రదుర్గలో ఇస్రో(ISRO) ప్రయోగం..
దేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న పునర్వినియోగ వింగ్డ్ రాకెట్ పుష్పక్‌ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. కర్ణాటక(Karnataka)లోని చిత్రదుర్గ(Chitradurga)లోగల ఏరోనాటికల్ టెస్టింగ్ రేంజ్(Aeronautical Testing Range)లో ఈ ప్రయోగం నిర్వహించింది. ఇందులో భాగంగా పుష్పక్ తనంతట తానుగా రన్‌వేపై ల్యాండైంది. ఈ ప్రయోగాన్ని వీక్షించేందకు ఇస్రో చైర్మన్ కూడా హాజరయ్యారు. అంతరిక్ష రంగంలో సుస్థిరత, వ్యర్థాల తగ్గింపు దిశగా ఇస్రో గత దశాబ్దకాలంగా పుష్పక్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది సింగిల్ స్టేజ్ టూ ఆర్బిట్ రాకెట్. అంటే పీఎస్ఎల్వీ లాగా వివిధ దశలకు బదులు ఒకే దశలో కక్ష్య(Orbit)లోకి చేరుకుంటుంది.
పుష్పక్(Pushpak)ను మూడోసారి విజయవంతం చేసిన ఇస్రో..
ఇందులో అత్యాధునిక ఎక్స్-33 అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్(X-33 Advanced Technology Demonstrator), ఎక్స్-34 టెస్ట్‌బెడ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్(X-34 Advanced Technology Demonstrator), ఆధునికీకరించినన డీసీ-ఎక్స్ఏ ఫ్లైట్ డెమాన్స్ట్రేటర్(DC-XA flight Demonstrator) ఉన్నాయి. పుష్పక్‌ను విజయవంతంగా ప్రయోగించడం ఇస్రోకు ఇది మూడోసారి. గతేడాది జరిపిన పరీక్షలో ఎయిర్‌ఫోర్సు హెలికాఫ్టర్ నుంచి వదిలిన పుష్ఫక్..మానవుల నియంత్రణ లేకుండా ల్యాండయ్యింది. దీంతో, ఆర్బిటల్ రీఎంట్రీ సామర్థ్యం సముపార్జనలో ఒకడుగు ముందుకు వేసింది.
రూ. 100 కోట్లతో ఇస్రో ‘పుష్పక్ విమాన్(Pushpak Viman)’ ప్రాజెక్టు..
ఇస్రో నిర్మించబోయే అంతరిక్ష స్పేస్ స్టేషన్‌కు విడిభాగాలు, వ్యోమగాముల తరలింపులో ఈ రాకెట్ కీలకం కానుంది. రూ. 100 కోట్లతో ఇస్రో ‘పుష్పక్ విమాన్’ ప్రాజెక్టు చేపట్టింది. 2012లో ఈ రాకెట్(Rocket) డిజైన్‌కు ఆమోదం లభించడంతో ఇస్రో ఆర్ఎల్వీ-టీడీ పేరిట ఓ ప్రయోగాత్మక పునర్వినియోగ రాకెట్ మోడల్‌ను రూపొందించింది. ఈ రాకెట్(Rocket) సామర్థ్యాలను పరీక్షించేందుకు 2016లో తొలిసారిగా పరీక్షించారు. పునర్వినియోగ సామర్థ్యం ఉన్న రాకెట్‌తో అంతరిక్ష ప్రయోగాల్లో వ్యర్థాల విడుదల తగ్గుతుందని ఇస్రో చెబుతోంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి