రష్యాలో భారీ భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7 గా నమోదైంది. రష్యా తూర్పు తీరంలోని మెయిన్ నావెల్ హెడ్‌క్వర్టర్‌కు సమీపాన భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో భయంతో జనం రోడ్లపైకి పరుగులు తీశారు. ఆస్థి నష్టం, ప్రాణ నష్టం గురించి ఇంకా వివరాలు అందలేదని అధికారులు తెలిపారు. పెట్రోపావ్లోవ్స్క్, కమ్చట్స్కీ భూకంప కేంద్రాలుగా ప్రకంపనలు వచ్చాయని US జియోలాజికల్ సర్వే తెలిపింది. రష్కాలోని తీరప్రాంతాలకు సునామీ వచ్చే అవకాశం ఉందని US నేషనల్ వెదర్ సర్వీస్ యొక్క పసిఫిక్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తర్వాత ప్రమాదం తగ్గిందని తెలిపింది. భూకంపం సంభవించిన ప్రాంతానికి సమీపంలోని తీర ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు సముద్ర మట్టంలో స్వల్ప హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చని అధికారులు తెలిపారు. తూర్పు తీర ప్రాంత నగరమైన లావ్స్కీ 102 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
50 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. భూకంపం ధాటికి ఇండ్లలో వస్తువులు కిందపడిపోయాయి. అయితే పెద్దగా ఆస్తి నష్టం ఏమీ జరుగలేదని అధికారులు వెల్లడించారు. భారీ భూకంపం నేపథ్యంలో హొనులులు లోని యూఎస్ నేషనల్ సర్వీస్‌కు చెందిన పసిఫిక్ సునామా హెచ్చరిక కేంద్రం తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసింది. రష్యా నౌకాదళానికి కీలక ప్రాంతమైన లావ్స్కీ నగరంలో లక్షా80వేల మంది నివాసం ఉంటున్నారు. చుట్టూ అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అత్యధిక భాగం నావల్ బేస్ అధీనంలో ఉంది. భూకంప తీవ్రతకు లావ్స్కీ 280 మైళ్ల దూరంలో ఉన్న షివేలుచ్ అగ్నిపర్వతం బద్దలయ్యింది. సుమారు 8 కిలోమీటర్ల ఎత్తువరకు లావాను వెదజళ్లుతోంది. దీంతో సమీపంలో ఉన్న ప్రాంతాలు మొత్తం బూడిదమయమయ్యాయి. ఆకాశంలో ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగజిమ్మిందంటే ఈ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్రోపవ్‌లావ్‌స్కీ- కమ్చట్స్కీ పలు ప్రాంతాలు బూడిదమయం అయ్యాయి. ఈ మార్గంలో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- విశ్వశాంతి కోసం మోడీ ప్రయత్నం…హైదరాబాద్‌లోని హైటెక్ సిటి శిల్పకళా వేదికలో లోక్‌మంథన్-2024 కార్యక్రమం ముగింపు వేడుకలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు జరిగిన లోక్ మంథన్‌లో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్,…
- IPL చరిత్రలోనే అత్యధిక ధర పలికిన పంత్..దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో భారత స్టార్ ప్లేయర్లు చరిత్రను తిరగ రాస్తున్నారు. వేలం స్టార్టింగ్ లోనే బౌలర్ అర్షదీప్ సింగ్‌ను పంజాబ్ జట్టు 18 కోట్లకు ఆర్టీఎమ్ చేసుకొగా.. అనంతరం స్టార్ బ్యాటర్ శ్రేయస్…
- రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి..సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానంతో సమావేశం అయ్యేందుకు హస్తినకు బయలుదేరనున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఉత్సవాలకు హాజరుకావాలని…
- సెంచరీతో కొత్త రికార్డును సృష్టించిన విరాట్ కోహ్లీబోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కొత్త రికార్డును సృష్టించాడు. సాలిడ్ డిఫెన్స్ తో పాటు అవసరమైన సమయంలో బ్యాట్ ను మంత్రడండంలా తిప్పుతూ మ్యాజికల్ షాట్స్ ఆడుతున్నాడు. హాఫ్ సెంచరీ దాటేసి…
- నాకు కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయివికసిత్ భారత్ లో యువత పాత్ర కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎన్సీసీ పేరు వినగానే మనకు స్కూల్-కాలేజీ రోజులు గుర్తుకొస్తాయని, తాను ఎస్సీసీ విద్యార్థిని అని తెలిపారు. ఆ సమయంలో తాను పొందిన అనుభవం అమూల్యమైనదని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి