చమురు, ఎల్పీజీ సంక్షోభంలో అల్లాడిపోతున్న ప్రపంచ దేశాలకు ఇరాన్ తియ్యని కబురు వినిపించింది..

Advertisements

<p>చమురు&comma; ఎల్పీజీ సంక్షోభంలో అల్లాడిపోతున్న ప్రపంచ దేశాలకు ఇరాన్ తియ్యని కబురు వినిపించింది&period; అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది&period; హర్మూజ్ ను పూర్తిగా తెరిచినట్టు వెల్లడించింది&period; లెబనాన్‌లో అమలవుతున్న కాల్పుల విరమణ కొనసాగినంత కాలం&comma; ఈ జలసంధి గుండా అన్ని రకాల వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది&period; ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ అధికారికంగా వెల్లడించారు&period; లెబనాన్‌లో కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగా&comma; ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ప్రకటించిన సమన్వయ మార్గంలో&comma; మిగిలిన కాల్పుల విరమణ కాలానికి హర్మూజ్ జలసంధి గుండా అన్ని వాణిజ్య నౌకల ప్రయాణానికి మార్గం పూర్తిగా తెరిచి ఉంటుందంటూ మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు&period;<br &sol;>&NewLine;అంతర్జాతీయ చమురు వాణిజ్యంలో హర్మూజ్ జలసంధి అత్యంత వ్యూహాత్మకమైనది&period; ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తాజా నిర్ణయం వాణిజ్య వర్గాలకు ఊరటనిస్తోంది&period; అయితే&comma; నౌకలు తమ దేశ మారిటైమ్ సంస్థ నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణించాలనే షరతును ఇరాన్ విధించింది&period; లెబనాన్‌లో శాంతియుత వాతావరణం కొనసాగేలా చూసే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.