107
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పలు రైస్ మిల్లుల పై వరుసగా రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా సాగర్ రోడ్డు, ఖమ్మం రోడ్డులలో గల పలు రైస్ మిల్లులలో అధికారుల తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొత్తం మీద ఆరు బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు ఐదు రైస్ మిల్లులో ఏకకాలంలో దాడులు జరిపారు. ఆయా రైస్ మిల్లుల్లో ధాన్యం కొనుగోలు అమ్మకాలకు సంబంధించి పలు రికార్డులను పరిశీలించారు. అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నారు.