ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు

Chandrababu and Prashant Kishore

Advertisements

&NewLine;<p>ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి&period; అనూహ్యంగా తెర మీదకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్షమయ్యారు&period; గన్నవరంలో ప్రత్యేక జెట్ లో నారా లోకేష్ తో పాటుగా దిగిన ప్రశాంత్ కిషోర్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు&period; 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు వెనుక కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల వేళ చంద్రబాబుతో సమావేశం కావటం ఆసక్తి కరంగా మారుతోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రశాంత్ కిషోర్ 2014లో ప్రధాని మోదీ విజయంలో ప్రధాన భూమిక పోషించారు&period; ఆ తరువాత ఢిల్లీలో ఆప్&comma; పంజాబ్ లో కాంగ్రెస్&comma; ఏపీలో జగన్ విజయం వెనుక కీలకంగా వ్యవహరించారు&period; 2019 ఎన్నికల ముందే జగన్ నాడు ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం చేసుకున్నారు&period; జగన్ గెలుపు తరువాత ప్రశాంత్ కిషోర్ దూరంగా ఉన్నాఆయన టీం వైసీపీ కోసం పని చేస్తోంది&period; ఇదే సమయంలో ఐ ప్యాక్ లో పీకే సహచరులుగా ఉన్న రాబిన్ శర్మ ప్రస్తుతం టీడీపీకి రుషి రాజ్ సింగ్ వైసీపీ కోసం పని చేస్తున్నారు&period; ఈ సమయంలో కొంత కాలంగా ప్రశాంత్ కిషోర్ కోసం టీడీపీ ప్రయత్నిస్తోందనే వార్తలు వచ్చాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రశాంత్ కిషోర్ ప్రస్తుత ఏపీ రాజకీయాల పైన కొద్ది రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేసారు&period; జగన్ 2019 ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ హామీల వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు&comma; జనసేనతో పొత్తుతో వెళ్లటంతో పాటుగా సంక్షేమ మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తున్నారు&period; ఈ సమయంలో ప్రశాంత్ కిషోర్ టీం ఏపీలో చేసిన సర్వే నివేదికలను చంద్రబాబుకు అందించినట్లు సమాచారం&period; టీడీపీ ఎక్కడ బలహీనంగా ఉందీ ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దాని పైన సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది&period; ఎన్నికలు పూర్తయ్యే వరకూ టీడీపీకి పీకే సూచనలు&comma; సలహాలు కొనసాగుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు&period; దీంతో&comma; పీకే ఎంట్రీతో టీడీపీ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుందా జగన్ ఎలా ఎదుర్కొంటారు&period; మొత్తంగా ఏపీ రాజకీయం ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత ఇక తాను రాజకీయ వ్యూహకర్తగా పని చేయనని ప్రకటించారు&period; బీహార్ లో సొంత పార్టీ ఏర్పాటు చేసి పాదయాత్ర చేస్తున్నారు&period; కొద్ది రోజులు క్రితం ప్రశాంత్ కిషోర్ తో ఢిల్లీలో భేటీ అయ్యారు&period; తమ పార్టీకి వ్యూహకర్తగా పని చేయకపోయినా రాజకీయ సలహాదారుగా వ్యవహరించాలని కోరారు&period; ఒకసారి చంద్రబాబుతో సమావేశానికి రావాలని ఆహ్వానించారు&period; ఈ మేరకు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తాడేపల్లి చేరుకున్నారు&period; ప్రశాంత్ కిషోర్ గతంలో జగన్ కోసం పని చేసి ఉండటంతో జగన్ బలాలు&comma; బలహీనతలు&comma; వ్యూహాల పైన పూర్తి అవగాహన ఉందని టీడీపీ నేతలు నమ్ముతున్నారు&period; దీంతో&comma; ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోసం పని చేస్తే జగన్ ను ఓడించటంలో సహకరిస్తుందని విశ్వసిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.