80
శ్రీకాకుళం జిల్లాలో గతవారం జరగవలసిన ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని, డిసెంబర్ 12 న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాకు రానున్నారని రాష్ట్ర మంత్రి సీధిరి అప్పలరాజు తెలిపారు. పలాసలో మీడియా తో మాట్లాడుతూ ఉద్ధానం ప్రాంతానికి దశాబ్దాల కాలంగా పీడిస్తున్న కిడ్నీ వ్యాధి ని శాశ్వతంగా నిర్మూలించేందుకు 720 కోట్లతో ప్రతీ గ్రామం లో ఏర్పాటు చేసిన శుద్ధ జలాల మంచినీటి పథకాన్ని మరియు పలాస లో కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని సిఎం చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని మంత్రి అప్పలరాజు తెలిపారు. ప్రభుత్వం నిర్మిస్తున్న వీటిని ప్రజలు సందర్శించేందుకు అనువుగా రెండు బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.