మూడేళ్ల విరామం తర్వాత ఎగరనున్న పతంగులు…

International Kite Festival

Advertisements

&NewLine;<p>అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌కు హైదరాబాద్ మరోమారు ముస్తాబైంది&period; ఈ నెల 13 నుంచి మూడు రోజుల పాటు పరేడ్ గ్రౌండ్స్‌లో పతంగుల పండగ కోలాహలంగా జరగనుంది&period; ఇందులో 16 దేశాలకు చెందిన 40 మంది&comma; మన దేశం నుంచి 60 మంది జాతీయ పతంగుల క్లబ్ సభ్యులు పాలుపంచుకుంటారు&period; మూడేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ పండుగ కోసం పర్యాటక శాఖ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది&period; కైట్ ఫెస్టివల్‌తో పాటు స్వీట్ ఫెస్టివల్‌ను కూడా అదే గ్రౌండ్స్‌లో దానితో పాటే నిర్వహిస్తారు&period; తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు&period; స్వీట్ ఫెస్టివల్‌లో భాగంగా జాతీయ&comma; అంతర్జాతీయ మిఠాయిలు స్టాల్స్‌లో అందుబాటులో ఉంచుతారు&period; దీంతో పాటు హస్తకళలు&comma; చేనేత వస్త్రాల స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు&period; సందర్శకుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని అధికారులు తెలిపారు&period; ఈ ఫెస్టివల్‌లో ప్రవేశం పూర్తిగా ఉచితమని&comma; అందరూ సందర్శించాలని ప్రభుత్వం కోరింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.